ఈతకు వెళ్లి బాలుడు మృతి…

A Boy Died In Pond

కేసముద్రం: చెరువులోకి ఈతకు వెళ్లిన బాలుడు మృతి చెందిన  సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కోమటిపల్లికి చెందిన పోలెపాక కృష్ణ, సుమలత దంపతుల కుమారుడు రోహిత్  3వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం బడి ముగిసిన అనంతరం రోహిత్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. చెరువులోకి దిగిన రోహిత్ నీటిలో మునగడంతో స్నేహితులు భయంతో ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి కావస్తున్నా బాలుడు ఇంటికి రాకపోవడంతో తల్లి సుమలత గ్రామంలో ఆరా తీసింది. ఆచూకీ లభ్యం కాకపోవడంతో రోహిత్ స్నేహితుల ఇంటికి వెళ్లి ప్రశ్నించగా, చెరువులో మునిగిపోయాడని తెలిపారు. దీంతో గ్రామస్తులు రాత్రి సమయంలో చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది.బాలుడు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments