ఈక్వెడార్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 24 మంది మృతి

క్విట్టో: రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి చెందగా , మరో 19 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన ఈక్వెడార్ రాజధాని క్విట్టో సమీపంలో జాతీయ రహదారి పై చోటు చేసుకుంది.  స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. కొలంబియా రిజిస్ట్రేషన్స్ ఉన్న బస్సు ఈక్వెడార్‌ రాజధాని క్విట్టో సమీపంలోని జాతీయ రహదారిపై అతి వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదకర మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ బస్సు ప్రమాదంలో మృతి […]

క్విట్టో: రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి చెందగా , మరో 19 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన ఈక్వెడార్ రాజధాని క్విట్టో సమీపంలో జాతీయ రహదారి పై చోటు చేసుకుంది.  స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. కొలంబియా రిజిస్ట్రేషన్స్ ఉన్న బస్సు ఈక్వెడార్‌ రాజధాని క్విట్టో సమీపంలోని జాతీయ రహదారిపై అతి వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదకర మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారంతా విదేశీయులని ఈక్వెడార్ ప్రభుత్వం తెలిపింది. బస్సు ఢీకొన్న వాహనంలో ఉన్న ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు, ఎక్కువ మంది కొలంబియాకు చెందిన వారని పోలీసులు,అధికారులు తెలిపారు.

Comments

comments

Related Stories: