ఇవి కాస్ట్‌లీ గురూ..

Mineral Water Bottle Cost

మనం బయటకి వెళ్లినప్పుడు దాహం వేస్తే ఒక మినరల్ వాటర్ బాటిల్‌ని కొంటాం. అది కొనాలన్నా పది సార్లు ఆలోచిస్తాం. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లినప్పుడు అంటే రైల్వేస్టేషన్, బస్ స్టాప్‌ల్లో లీటర్ వాటర్ బాటిల్ ధర 20 నుంచి 50 రూపాయలు ఉంటుంది. కానీ మన సెలబ్రిటీలు తాగే వాటర్ బాటిల్ ఖర్చు ఎంత ఉంటుందో తెలుసా.. నీటి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమి ఉంటాయని మీరు అనుకుంటున్నారా… అయితే మీరు వాటర్ మ్యాటర్ గురించి తెలుసుకోవాల్సిందే. నీరు ఎంత పెద్ద మంటలను అయినా ఆర్పేస్తుంది. ఇప్పటి తరం పిల్లలు మనకు నీరు ఎటునుంచి వస్తుందంటే వెంటనే చాలా వరకు ఏం చెబుతారు హోటల్‌కి వెళ్లి ఒక రూపాయి ఇస్తే వాటర్ ప్యాకెట్ రూపంలో దొరుకుతుంది అని చెబుతుంటారు. కానీ మనకు సహజ జల వనరుల నుంచి దొరికే జనరల్ వాటర్, ప్లాస్టిక్ బాటిల్స్‌ల్లో అమ్మే వాటర్ గురించి తెలుసు. ఇంక ఎటర్నల్ వాటర్ అనగా పవిత్ర గంగాజలాలు కూడా తెలుసు.

మాములుగా మినరల్ అయినా జనరల్ అయినా నీరు అనేది ఒకటే. రసాయన శాస్త్రరీత్యా నీటి ఫార్ములా హెచ్2ఓ… అంటే, రెండు ఉదజని పరమాణువులకు, ఒక ఆమ్లజని పరమాణువుతో రసాయనిక బంధం ఏర్పడితే నీరు తయారవుతుంది. అలా వచ్చిన నీటినే రకరకాల పేర్లతో, స్టిక్కర్లు వేసి డెకరేషన్లతో వివిధ ధరలకు అమ్మేస్తున్నారు. అలాంటి కొన్ని లగ్జరీ వాటర్ వెరైటీలను తెలుసుకుందాం… స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్ ఇవిఎన్. దీని ధర రూ.600లు. ప్రసుత్తం కొందరు తాగే వాటర్‌బాటిల్స్ రేటు ఎంతవుందో కూడా తెలుసుకుందాం…

బెర్గ్ వాటర్ : బెర్గ్ బ్రాండ్ పేరిట 750 మిల్లీలీటర్ల సీసాల్లో మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ నీటికి ధనిక వర్గాల నుంచి బాగానే డిమాండ్ ఉంటోంది. దీని ధర సీసాకు 12.92 డాలర్లు(రూ.838) మాత్రమే. ఇది పురాతన మంచుఖండాలు భూతాపానికి కరిగినప్పుడు సేకరించిన నీటిని అందమైన సీసాల్లో పట్టి అమ్ముతోంది బెర్గ్ బ్రాండ్  కెనడియన్ కంపెనీ.

బ్లింగ్ హెచ్2ఓ : ప్లాస్టిక్ సీసాల్లో దొరికే మినరల్ వాటర్ కంటే ఇందులో ఉండే నీరు ఏమంత భిన్నంగా ఉండదు. 750 మిల్లీలీటర్ల నీరు  ఉండే ఒక్కో సీసా ధర 36.75 డాలర్లు(రూ.2,384) మాత్రమే. కొత్తల్లో దీన్ని సెలబ్రిటీలకు మాత్రమే అమ్మేవారు. ఇప్పుడది ధర చెల్లించుకోగల అందరికీ అందుబాటులో ఉంది. ఇందులో నీటి విశేషం పెద్దగా ఏమీ లేదు గానీ, ఖరీదైన స్ఫటికాలతో అలంకరించిన సీసాదే విశేషమంతా.

ఫిలికో బువెల్ వాటర్ : వెండి మూతలతో, ఖరీదైన స్ఫటికాలు పొదిగి చదరంగం పావుల ఆకారంలో తీర్చిదిద్దిన సీసాల్లో అమ్ముతోంది జపనీస్‌కు చెందిన ఫిలికో కంపెనీ. జపాన్‌లోని ఒసాకా సమీపాన గల కోబె ప్రాంతం లోని జలపాతాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన నీరు ఇది. ఒక్కో సీసాలో 720 మిల్లీలీటర్ల నీరు ఉంటుంది. ఒక్కో సీసా ధర సుమారుగా 135 డాలర్లు(రూ.8,756)మాత్రమే. ఇదే కంపెనీకి చెందిన హెలో కిట్టీ ఫిలికో వాటర్.

Comments

comments