ఇల్లు కూలి ఒకరి మృతి

కుమ్రంభీం ఆసిఫాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమనేపల్లిలో మంగళవారం ఉదయం ఇల్లు కూలి ఒకరు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. మృతుడు పోశాలు (70)గా గుర్తించారు. అతని కొడుకు బాపు(50) తీవ్రంగా గాయపడ్డాడు. బాపు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. పోశాలు కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పోస్టుమార్టం కోసం పోశాలు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై […]

కుమ్రంభీం ఆసిఫాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమనేపల్లిలో మంగళవారం ఉదయం ఇల్లు కూలి ఒకరు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. మృతుడు పోశాలు (70)గా గుర్తించారు. అతని కొడుకు బాపు(50) తీవ్రంగా గాయపడ్డాడు. బాపు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. పోశాలు కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పోస్టుమార్టం కోసం పోశాలు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

One Person Died with House Collapsed

Related Stories: