ఇలా అయితే ఎలా?

 50 crore financial crimes

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి : అతనొక ప్రభుత్వ అధికారి సొసైటీల పేరుతో ప్రత్యేకించి ఆర్థిక వ్యవహారాలతో కూడిన సంస్థలకు అనుమతిచ్చేటప్పుడు ఆలోచించాల్సిన ఆయన అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. అనుమతులు ఇవ్వకపోతే నిందితులు రూ.5కోట్ల పైబడి ప్రజాధనం లూటీ చేసే అవకాశం ఉండేది కాదన్నది స్పష్టం. హ్యాపీ ఫ్యూచర్‌లో మల్టీపర్పస్ కో ఆపరేటివ్ సొసైటీ లి॥ సంస్థకు రిజిస్ట్రేషన్ సహా ఇతర అనుమతులు ఇవ్వకపోతే ఇన్ని వందల మంది మోసపోయే వారు కాదు. హెచ్‌ఎఫ్‌సిఎస్ సంస్థ గుట్టు రట్టుకాక ముందే కొందరు మీడియా ప్రతినిధులు ఇదే అధికారిని వివరణ కోరితే అంతా సక్రమమేనంటూ వాదించారు. అదే అధికారి సంస్థ నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆదారాలు ఉన్నాయన్న విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇంకొందరి రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏదో ఒక రూపంలో అనుమతులు పొందిన తర్వాతనే ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఏడాది  కాలంలో ఖమ్మం జిల్లాలో 50కోట్ల మేర ఆర్థిక నేరాలు జరిగాయి. అధిక వడ్డీలు ఇస్తామంటూ కొందరు, ఉపాధి కల్పిస్తామంటూ మరి కొందరు, మీరు చెల్లించిన దానికి రెట్టింపు రుణం ఇస్తామంటూ మరి కొందరు ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుని పరారవుతున్నారు.

తిన్నాడు తిరుపతి వెంకటేశ్వర్లు ఇచ్చిన వాడు పిచ్చోడు అన్న సామెతలా తయారైంది పరిస్థితి. రకరకాల ఆర్థిక నేరాల్లో పోలీసులు నిందితులను పట్టుకోవడంలో చిత్తశుద్ది ప్రదర్శిస్తున్న పరోక్ష కారకులపై ఆధారాలున్నా వదిలేయడమే ప్రశ్నార్థకమవుతుంది. పరోక్ష కారకులపై చర్యలు తీసుకోకపోతే మరి కొందరు నిందితులు మరో నేరానికి పాల్పడే అవకాశం కల్పిస్తారు. అంతిమంగా మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగులే నష్టపోవాల్సి వస్తుంది. కోట్లాది రూపాయల మేర ప్రజా ధనాన్ని దోచుకుని జల్సాలు చేసి బంధువుల పేరున ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. వస్తే కోట్లు దొరికితే జైలు అంతే కానీ ఆస్తులకు ఎటువంటి ఢోకా లేదన్న భావన బలపడుతుంది. ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం చేసిన పక్షంలో ఆర్థిక నేరాలు తగ్గుముఖం పడతాయి. ఆ దిశగా ఆలోచనలు చేసి ఆర్థిక నేరాలను అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

comments