ఇమ్రాన్‌కు పాక్ క్రికెటర్ల మద్దతు…

Pak Cricketer Support to Imran khan

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో బుధవారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ పై ప్రధాన పార్టీల నేతలు దృష్టి సారించారు. దీంతో పాకిస్థాన్ పార్లమెంట్‌కు జరుగుతున్నఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్టు తెలుస్తోంది. అతనికి తాలిబన్లతో పాటు పాక్ ఆర్మీ నుంచి భారీ మద్దతుందని సమాచారం. ఇమ్రాన్ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆదేశ క్రికెటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇమ్రాన్ సారథ్యంలోని పాక్ 1992 క్రికెట్ వరల్డ్ కప్‌ను గెలిచి ఛాంపియన్‌గా నిలబడింది. తన పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇమ్రాన్‌కు తన సహచర ఆటగాళ్లతో సహా ప్రస్తుత పాకిస్థాన్ ఆటగాళ్లు అక్రమ్‌కు మద్దతుగా నిలబడ్డారు. ఈ నెల 25న జరిగే ఎన్నికల్లో ఓటర్లు అంతా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఇమ్రాన్ సారథ్యంలో పాక్ ప్రపంచకప్ నెగ్గిందని అలాగే మీ పరిపాలనలో పాక్ అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. పాక్ స్టార్ బౌలర్ వసీం అక్రమ్, లెజండరీ పేసర్ వకార్ యూనిస్, స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్, పాక్ మాజీ సారథి మహ్మద్ హఫీజ్, పేసర్ ఉమర్ గుల్ తదితరులు సామాజిక మాద్యమాల్లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

Comments

comments