ఇమ్రాన్‌కు ట్రంప్ షాక్

300 మిలియన్ డాలర్ల సాయం రద్దు వాషింగ్టన్: పాకిస్తాన్ విషయంలో అమెరికా మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదుల ఏరివేత కోసం పాక్ మిలిటరీకి ఇచ్చే 300 మిలియన్ డాలర్ల( సుమారు రూ. 2130 కోట్ల) సాయాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పాక్‌కు ఇచ్చే 500 మిలియన్ డాలర్ల సాయాన్ని అమెరికా కాంగ్రెస్ కొన్ని నెలల క్రితమే  నిలిపివేసినట్లు పెంటగాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది […]

300 మిలియన్ డాలర్ల సాయం రద్దు

వాషింగ్టన్: పాకిస్తాన్ విషయంలో అమెరికా మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదుల ఏరివేత కోసం పాక్ మిలిటరీకి ఇచ్చే 300 మిలియన్ డాలర్ల( సుమారు రూ. 2130 కోట్ల) సాయాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పాక్‌కు ఇచ్చే 500 మిలియన్ డాలర్ల సాయాన్ని అమెరికా కాంగ్రెస్ కొన్ని నెలల క్రితమే  నిలిపివేసినట్లు పెంటగాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే అమెరికా ఆ దేశానికి ఈ షాక్ ఇవ్వడం గమనార్హం. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవడంలో పాక్ విఫలమయిందని అమెరికా పేర్కొంది.

తాజాగా పెంటగాన్ ప్రతినిధి కోన్ ఫాల్కనర్ మీడియాతో మాట్లాడుతూ ‘హక్కానీ నెట్‌వర్క్, లష్కరే తోయిబా, అఫ్గానీ తాలిబన్‌లాంటి ఉగ్రవాద ముఠాలను  అణచివేయడానికి పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకు రావడానికి అమెరికా ప్రయత్నిస్తూనే ఉంటుంది. అత్యవసర సాయం కింద అమెరికా కాంగ్రెస్ అమోదం తెలిపితేనే మేము నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. పాక్‌కు ఇవ్వాల్సిన 300 మిలియన్ డాలర్ల సాయాన్ని పూర్తిగా నిలిపివేశాం’ అని చెప్పారు. ఇంతకు ముందు పాక్‌కు అమెరికా సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేయగా ఇప్పుడు  పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల ఏరివేత కోసం తాము పాక్‌కు సాయం చేస్తూ ఉంటే పాక్ మాత్రం తమకు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడంకంటే ఏమీ చేయడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించడం తెలిసిందే.

Comments

comments