ఇబ్బందులు కలిగించొద్దు

Larry strike from Tomorrow in Suryapet District

మన తెలంగాణ/సూర్యాపేట : రేపటి నుండి చేపట్టే లారీల సమ్మె వలన జిల్లా లో నిత్యావసర వస్తువుల సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగి ంచవద్దని జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశమునకు జిల్లా ఎస్పీ ప్రకాశ్ జా దవ్‌తో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ఆలిండియా నిరవధిక లారీల సమ్మె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశం అని తెలుపుతూ జిల్లాలో నిత్యవసర వస్తువుల సరఫరా చేసే లారీలపై ఎలాంటి ఆటంకాలు కలిగించరాదని అన్నారు. లారీల సమ్మెలో భాగంగా జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కగలకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రోజువారి నిత్యావసరాలు పాలు, కూరగాయలు, గ్యాస్, డీజిల్, పెట్రోల్, మరికొన్ని వాటిపై మినహాయి ంపులు ఉన్నందున సరఫరా యథావిధిగా జరగాలని ఆయన సూచించారు. లారీ అసోసియేషన్స్ వారు చేపట్టే డిమాండ్లు కేంద్ర, రాష్ట్ర పరిధిలో ఉన్నందున ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇబ్బందులు కగలకుండా ఇబ్బందులు కలిగించకుండా చూడాలని, ఆర్టీసి, జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారికి సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ మా ట్లాడుతూ సమ్మె వలన లారీల అసోసియేషన్లు ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా సహకరించాలని, సమ్మె నేపథ్యంలో లారీలపై ఎలాంటి దాడులు చేయరాదని సూచించారు. దాడులకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉండడం జరుగుతుందని, నిత్యవసర సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ సంజీవరెడ్డి, ఆర్డీఓలు మోహన్‌రావు, భిక్షునాయక్, జిఎం. పౌరస రఫరాలు బి.రాంపతి, జిల్లా పౌర సర ఫరాల అధికారిణి ఎ.ఉషారాణి, డియంఆ ర్‌టిసి శ్రీనివాస్, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ లారీ అసోసి యేషన్ అధ్యక్షుడు గుండు నర్సింహా గౌడ్, జిల్లా అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Comments

comments