ఇప్పుడే ఏ విషయం చెప్పలేం: ఒపి రావత్

Will Assess if Telangana Assembly Elections Can be Held With 4 Other States

తెలంగాణ ముందస్తు ఎన్నికల మీద ఊహాగానాలు ఎలా ఉన్న ఎన్నికల కమిషన్ మాత్రం తీవ్ర సందిగ్ధంలో ఉంది. చత్తీస్ గఢ్, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లతో పాటు తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలను నిర్వహించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ఎటూ తేల్చుకోలేకపోతోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశాలను ఇప్పుడే చెప్పలేమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒపి రావత్ శుక్రవారం వెల్లడించారు. ఈ రెండు రోజుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యలపై చర్చించి ఆ తర్వాతే నిర్ణయం వెల్లడిస్తామన్నారు. ఇదిలాఉండగా నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతాయని సాక్షాత్తు కెసిఆర్ చెప్పడంతో అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నాయి. మరోవైపు సిఇసి రావత్ తో సిపిఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, నారాయణలు ఇవాళ భేటీ అయ్యారు. నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణకు కూడా ఎన్నికలు జరుగుతాయని కెసిఆర్ ప్రకటించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగానే రావత్ తన అభిప్రాయాన్ని తెలిపారు. కాగా, అసెంబ్లీ రద్దు అయినా తరువాత వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలనే 2002 సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఈ సందర్భంగా రావత్ గుర్తు చేశారు.

Comments

comments