ఇనుప ఉచ్చులో చిరుత…

Leopard Caught by Poachers in Kamareddy District

కామారెడ్డి: చిరుత సంచారం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన ఘటన కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొప్పాపల్లి శివారులో జరిగింది. గత కొన్ని రోజులుగా శివారు ప్రాంతాల్లో చిరుత సంచరించడం గమనించిన వేటగాళ్లు బొప్పాపల్లి శివారు ప్రాంతంలో ఇనుప ఉచ్చును బిగించారు. దీంతో ఆ ఇనుప ఉచ్చులో చిరుత చిక్కుకుంది. అనంతరం స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుతను వేరే ప్రాంతానికి తరలించారు.