హైదరాబాద్: భాగ్యనగరానికి చెందిన ఇద్దరు యువకులను ఎన్ఐఎ అధికారులు అరెస్టు చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఇద్దరిని అరెస్టు చేశారు. ఆగస్టు 6న హైదరాబాద్లో పలుచోట్ల ఎన్ఐఎ అధికారులు సోదాలు చేపట్టారు. సోదాలు సందర్భంగా పలువురిని విచారించి పాతబస్తీకి చెందిన అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాదర్లను అరెస్టు చేశారు.