ఇద్దరు కుమారులతో సహా తల్లి ఆత్మహత్య…

జనగామ : మనస్థాపంతో ఇద్దరు కుమారులతో సహా తల్లి రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం పట్టణంలోని అంబేద్కర్‌నగర్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం… మాదాసు మధుకర్ హైద్రాబాద్‌లో జీ4 సెక్యూరిటి సర్వీసెస్‌లో సెక్యూరిటి గార్డుగా విధులు నిర్వర్తిస్తూ.. తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మధుకర్‌కు భార్య మధులత (27), కుమారులు ఉదయ్ (8), వినయ్ (4) ఉన్నారు. గత నాలుగు రోజుల క్రితం మధులత తన అన్న అత్తగారి గృహప్రవేశం హైద్రాబాద్‌ కు […]


జనగామ : మనస్థాపంతో ఇద్దరు కుమారులతో సహా తల్లి రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం పట్టణంలోని అంబేద్కర్‌నగర్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం… మాదాసు మధుకర్ హైద్రాబాద్‌లో జీ4 సెక్యూరిటి సర్వీసెస్‌లో సెక్యూరిటి గార్డుగా విధులు నిర్వర్తిస్తూ.. తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మధుకర్‌కు భార్య మధులత (27), కుమారులు ఉదయ్ (8), వినయ్ (4) ఉన్నారు. గత నాలుగు రోజుల క్రితం మధులత తన అన్న అత్తగారి గృహప్రవేశం హైద్రాబాద్‌ కు వెళ్తానంటే మధుకర్ ఇంకా నాలుగు రోజులలో రాఖీ పౌర్ణమీ ఉన్నందున అప్పుడే వెళ్ళవచ్చు అన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మద్య గొడువ జరిగి ఇరువురు మాట్లాడుకోవడం లేదు. ఆదివారం మృతురాలి భర్త మధుకర్ నైట్‌డ్యూటి చేసి ఇంటికి వచ్చి పడుకున్న సమయంలో అతనిని నిద్రనుండి లేపి నేను తన తల్లిగారింటికి వెళ్తున్నానని చెప్పి తన ఇద్దరు పిల్లలతో భయలుదేరి వీవర్స్ కాలనీ సమీపంలో కాజీపేట నుండి సికింద్రాబాద్ వెళ్ళే శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలు క్రింద పడి ముగ్గురు మృతి చెందారు. ఇన్స్‌పెక్టర్ ఆఫ్ రైల్వే పోలీసు సిఐ ఎస్. వెంకటేశ్ మృతదేహాలను స్థానిక జిల్లా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments

Related Stories: