ఇగోయిస్టు అమ్మాయిగా కనిపిస్తా..

నాగచైతన్య, అను ఇమాన్యుయల్ జంటగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ చిత్రం ఈనెల 13న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అను ఇమాన్యుయల్ విలేకరులతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు… ఎక్కువగా మాట్లాడే… ఈ సినిమాలో నేను ఇగోయిస్టు అమ్మాయిగా కనిపిస్తాను. నా పాత్రలో కామెడీ కూడా ఉంటుంది. తొలిసారి ఈ సినిమాలో ఎక్కువగా మాట్లాడే అవకాశం వచ్చింది. ఆమె బ్రిలియంట్… ఇందులో రమ్యకృష్ణ కూతురిగా నటించాను. ఆమె చాలా బ్రిలియంట్. […]

నాగచైతన్య, అను ఇమాన్యుయల్ జంటగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ చిత్రం ఈనెల 13న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అను ఇమాన్యుయల్ విలేకరులతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
ఎక్కువగా మాట్లాడే…
ఈ సినిమాలో నేను ఇగోయిస్టు అమ్మాయిగా కనిపిస్తాను. నా పాత్రలో కామెడీ కూడా ఉంటుంది. తొలిసారి ఈ సినిమాలో ఎక్కువగా మాట్లాడే అవకాశం వచ్చింది.
ఆమె బ్రిలియంట్…
ఇందులో రమ్యకృష్ణ కూతురిగా నటించాను. ఆమె చాలా బ్రిలియంట్. ఒక్కసారి స్క్రిప్ట్ చూస్తే చాలు ఎంత పెద్ద డైలాగ్ అయినా ఆమె అలవోకగా చెప్పేస్తుంది.
అందుకే అవి చేశా…
ఇటీవల నా సినిమాలు కొన్ని నిరాశపరిచాయి. ‘అజ్ఞాతవాసి’ కథను త్రివిక్రమ్ చెప్పిన తర్వాత నా పాత్ర గురించి పూర్తిగా తెలుసుకొని ఆ సినిమాకు ఒప్పుకున్నాను. ఎందుకంటే ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ప్రణీత పాత్ర పెద్దగా ఉండదు. నా పాత్ర కూడా అలాగే ఉంటే నేను చేయకపోయేదాన్ని. పవన్‌కళ్యాణ్ హీరో కావడం వల్లే ఆ సినిమా చేశాను. ఇక ‘నా పేరు సూర్య…’ కూడా కథ విన్నాక నచ్చి చేశాను.
ఆ సినిమా కుదరలేదు…
‘గీత గోవిందం’లో హీరోయిన్‌గా చేసే అవకాశం నాకు వచ్చింది. ఆ సమయంలో నేను ‘నా పేరు సూర్య..’ సినిమా చేస్తున్నాను. అందుకే ఆ సినిమా చేయడం కుదరలేదు. ‘గీత గోవిందం’ మిస్ అయినందుకు బాధపడ్డాను.
నెక్స్ మూవీస్…
ప్రస్తుతం తెలుగులో ఏ సినిమాకు సైన్ చేయలేదు. ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా విడుదలైన తర్వాత కొత్త సినిమాల గురించి ఆలోచిస్తాను. ఇక మంచి పాత్ర దొరికితే తమిళ్‌లో సినిమా చేయాలని ఉంది. ఇక మలయాళంలో స్క్రీన్ షేర్ తక్కువగా ఉంటుంది. అక్కడ మంచి పాత్రలు వస్తే చేస్తాను.

Related Stories: