ఇక నుంచి విక్టరీ వెంకటేశ్ కాదు.. వెరైటీ వెంకటేశ్…!!

గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ సూపర్ సక్సెస్ తో మాంచి జోరు మీదున్నాడు డైరెక్టర్ క్రిష్. ఇక, బాబు బంగారం మూవీ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని గురు మూవీ లో నటిస్తున్నాడు విక్టరీ వెంకటేశ్. గురు మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే… గురు మూవీ తర్వాత వెంకటేశ్ మూవీ డైరెక్టర్ క్రిష్ తోనేనట. రీసెంట్ గా వెంకటేశ్ కు క్రిష్ స్టోరీ కూడా చెప్పాడట. స్టోరీ వినగానే ఓకే చెప్పేశాడట వెంకీ. అయితే… క్రిష్ […]

గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ సూపర్ సక్సెస్ తో మాంచి జోరు మీదున్నాడు డైరెక్టర్ క్రిష్. ఇక, బాబు బంగారం మూవీ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని గురు మూవీ లో నటిస్తున్నాడు విక్టరీ వెంకటేశ్. గురు మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

అయితే… గురు మూవీ తర్వాత వెంకటేశ్ మూవీ డైరెక్టర్ క్రిష్ తోనేనట. రీసెంట్ గా వెంకటేశ్ కు క్రిష్ స్టోరీ కూడా చెప్పాడట. స్టోరీ వినగానే ఓకే చెప్పేశాడట వెంకీ. అయితే… క్రిష్ సినిమా స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు వస్తున్నాయి.

వైవిధ్యమైన పాత్రలో వెంకీ ఇందులో నటిస్తాడని… హీరో కమ్ విలన్ రోల్ వెంకీనే పోషిస్తాడని టాక్. కథ కొంచెం కొత్తగా ఉండటంతో వెంకటేశ్ కు సూపర్ గా నచ్చిందట. మూవీ కి కవచం అనే టైటిల్ పెట్టాలని మూవీ యూనిట్ ఆలోచిస్తుందట.

ఇక, వెంకీ, క్రిష్ కాంబో లో మూవీ వస్తే… బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లే కలెక్షన్లు అంటూ అటు వెంకీ, ఇటు క్రిష్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారట.

Related Stories: