ఇండోనేషియాలో విమాన ప్రమాదం

8dies in Indonesia Plane Crash

జకార్త : ఇండోనేషియాలోని తూర్పు ప్రాంతంలో ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. ఎనిమిదేళ్ల ఓ బాలుడు మాత్రం ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. స్విస్ కంపెనీకి చెందిన విమానం పపువా న్యూగినియా ప్రావిన్సులోని గగనతలంలో ప్రయాణిస్తుండగా సమస్య తలెత్తింది. ఆదివారం ఉదయం ఓక్సిబిల్‌లోని అటవీ ప్రాంతంలో ఉన్న పర్వతాల మధ్య కూలిపోయింది. విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన విమానం ఓ ప్రైవేటు సంస్థకు చెందినదని, ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో ఈ విమానం ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. విమానం కూలిపోవడానికి ముందు పెద్ద శబ్దం వినిపించిందని స్థానిక ప్రజలు తెలిపారు.

Comments

comments