ఇండోనేషియాలో భూకంపం

Earthquake in Indonesia

జకర్తా : ఇండోనేషియాలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. లోంబన్ ద్వీపంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. భూకంపం రావడంతో స్థాని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు పెట్టారు. పదిహేను రోజుల క్రితం ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించి 460 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఆదివారం సంభవించిన భూకంప ప్రభావం లోంబక్ రాజధాని మతారమ్, బాలి ద్వీపంలో కనిపించింది.

Earthquake in Indonesia

Comments

comments