ఇండియా కబ‘డీలా’!

India Kabaddi team loses to South Korea at Asian Games 2018

ఆసియా క్రీడల్లో కబడ్డీలో ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్ జట్టుకు దిగ్భ్రాంతికర అపజయం ఎదురైంది. గురువారం జరిగిన సెమీఫైనల్‌లో ఇరాన్ చేతిలో 1827తో భారత్ ఓడిపోయింది. ఇదివరలో జరిగిన ఆసియా క్రీడల్లో బీజింగ్‌లో 1990లో హాకీని చేర్చాక భారత పురుషుల హాకీ జట్టు ఏడుసార్లు వరుసగా స్వర్ణ పతకాన్ని గెలుస్తూ వచ్చింది. కానీ ఈసారే ఫైనల్‌లోకి వెళ్లలేక పోయింది. పాకిస్థాన్‌తో పాటు భారత్ కూడా కాంస్యానికే పరిమితమైంది. సెమీఫైనల్లో పాకిస్థాన్ కూడా దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది. గ్రూప్ దశలో దక్షిణ కొరియా చేతిలో భారత్ ఓడిపోయి రెండో స్థానంలో నిలిచింది. ఇక కబడ్డీ ఫైనల్‌లో ఇరాన్, దక్షిణ కొరియా తలపడనున్నాయి.

Comments

comments