ఇండియాకు ముచ్చటగా మూడో స్వర్ణం

Asian Games 2018: Saurabh Chaudhary wins gold

జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల హవా కొనసాగుతోంది. తాజాగా భారత్ ఖాతాలో ముచ్చటగా మూడో స్వర్ణం వచ్చి చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఇండియాకు స్వర్ణం వచ్చింది. మంగళవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరభ్ చౌదరి స్వర్ణ పతకం గెలిచారు. ఇదే ఈవెంట్ లో అభిషేక్ వర్మ కాంస్యం గెలిచాడు. దీంతో భారత్ పతకాల సంఖ్య ఏడుకు చేరింది. వీటిలో మూడు స్వర్ణాలు, రెండు రజతం, రెండు కాంస్యం ఉన్నాయి.

Comments

comments