ఇంటెన్సివ్‌కేర్‌లో మహావృక్షం!

Banyan-Tree

ఏడు వందల ఏళ్లనాటి మహావృక్షం ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్‌లో ఉంది. అవును నిజమే.. మహబూబ్‌నగర్‌లో ఉన్న పిల్లల మర్రి పర్యాటకులను ఆకర్షించే ప్రదేశం. అక్కడున్న పిల్లలమర్రి చెట్టును చూడటానికి ఏటా పర్యాటకులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. ఇప్పుడా చెట్టు జబ్బునపడింది. అగ్రికల్చరల్ అధికారులు జాగ్రత్తగా దానికి సపర్యలు చేస్తున్నారు.  మహబూబ్‌నగర్ శివార్లలో  హైదరాబాద్‌కు 115 కిమీ దూరంలో ఉన్న ఈ బనియాన్ ట్రీ గత 5 నెలలుగా చీడపీడలబారిన పడింది. బయోలజిస్టులు దాని కాండం, వేళ్లను పరీక్షిస్తున్నారు. ఇంజక్షన్లు ఇస్తూ, రసాయనాలతో కాపాడుతున్నారు.  చెట్టుకీపర్ మాట్లాడుతూ…. ఈ చెట్టుకి ఇంకా కొత్త ఆకులు, మొలకెత్తుతున్నాయి. అంటే దీనికి ఇంకా ఆయుష్షు ఉంది.. త్వరగా కోలుకుంటుందనే నమ్మకం ఉంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు దీన్ని రక్షించమంటూ ఆ దేవున్ని ప్రార్థిస్తున్నారు అంటూ కంటనీరు పెట్టుకుంటున్నాడు.  4 ఎకరాల స్థలంలో ఆక్రమించుకున్న ఈ చెట్టు పడిపోయింది కానీ చనిపోలేదు.  చెట్టు మొత్తం వైరస్  వ్యాపించింది. చెట్టుకి స్లైన్ బాటిల్స్‌లాంటివి పెట్టి దానికి వైద్యం అందిస్తున్నారు.   హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వర్కర్లు డ్రిప్ పద్ధతిలో కాపాడుతున్నారు.  ఇమ్మెర్సన్ థెరఫీ సాయంతో  వేళ్లలోకి అందేలా గన్నీబ్యాగ్‌ల్లో ఇన్‌సెక్టిసౌడ్‌ను నింపి తగిలిస్తున్నారు. పిల్లలమర్రి చెట్టు త్వరగా కోలుకోవాలని ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు కోరుకుందాం..

Comments

comments