ఇంటికి ఎల్‌ఈడీ వెలుగులు!

ఎవరైనా సకుటుంబంతో ఉండాలంటే చక్కని ఇల్లు అవసరం. ఆ ఇంట్లో ఉండాలనుకునే హంగులు కూడా వారికి తగ్గట్టుగా ఆధునికంగా ఉండాలనుకుంటారు. అలా వారు ఉంటున్న ఇంట్లోని వస్తువుల ఆధారంగా ఆ కుటుంబంపై కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. అందులో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎల్‌ఈడీ లైట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కొత్తగా ఇల్లు కట్టుకునే వారు ఇంటిరీయల్ డిజైన్‌లో ఎక్కువ శాతం వీటినే ఉపయోగిస్తున్నారు. రాను రాను ట్యూబ్‌లైట్లు, సీఎఫ్‌ఎల్ బల్బుల వాడకం తక్కువైపోయింది. ఈ ఎల్‌ఈడీ లైట్లవల్ల […]

ఎవరైనా సకుటుంబంతో ఉండాలంటే చక్కని ఇల్లు అవసరం. ఆ ఇంట్లో ఉండాలనుకునే హంగులు కూడా వారికి తగ్గట్టుగా ఆధునికంగా ఉండాలనుకుంటారు. అలా వారు ఉంటున్న ఇంట్లోని వస్తువుల ఆధారంగా ఆ కుటుంబంపై కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. అందులో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎల్‌ఈడీ లైట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కొత్తగా ఇల్లు కట్టుకునే వారు ఇంటిరీయల్ డిజైన్‌లో ఎక్కువ శాతం వీటినే ఉపయోగిస్తున్నారు. రాను రాను ట్యూబ్‌లైట్లు, సీఎఫ్‌ఎల్ బల్బుల వాడకం తక్కువైపోయింది. ఈ ఎల్‌ఈడీ లైట్లవల్ల కరెంట్ చార్జ్‌లు తక్కువగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇంటిరీయల్ డిజైనర్స్ చెబుతున్నారు. కేవలం వెలుతురే కాకుండా ఇంటి అందాన్ని రెట్టింపు చేసే జాబితాలో లైట్ ఎమిటింగ్ డయోడ్ (ఎల్‌ఈడీ) లైట్లు చేరాయి. స్మార్ట్‌ఫోన్ నుంచి కూడా ఆపరేటింగ్ చేసుకునే వీలుంటుంది. బల్బు, ట్యూబ్‌లైట్లలో డే లైట్, వామ్ లైట్ అనే రెండు రంగులు మాత్రమే ఉంటాయి. కానీ ఎల్‌ఈడీ లైట్లలో మనకు నచ్చిన కోరుకున్న రంగులో మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి.

ప్రస్తుతం కొందరూ ఈమధ్య కాలంలో వారికి నచ్చిన రంగులో లైట్లను అమర్చుకుంటున్నారు. వారి అభిరుచికి తగ్గట్టుగా వేరు వేరు రంగులను ఇష్టపడుతున్నారు. గార్డెనింగ్‌లో ఆకుపచ్చ, పూజ గదిలో ఎరుపు, హాల్‌లో వామ్ లైట్, స్టడీ రూంలో డే వైట్ లైట్, బెడ్ రూంలో నీలం, ఆఫీసుల్లో ప్యూర్ వైట్, బంగారు దుకాణాల్లో, బట్టల దుకాణాల్లో వామ్ లైట్, రెస్టారెంట్లు, పబ్బుల్లో నీలం, ఎరుపు, ఆరెంజ్ రంగులను ఎక్కువగా వాడుతున్నారు. ఒకే ఎల్‌ఈడీ లైట్‌తో రోజుకో రంగును వెదజల్లేలా సరికొత్త టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకొచింది. ఇప్పుడు ఈ లైట్లలో లైట్ ఆటోమిషన్ అనే పద్ధతి ఎక్కువగా నడుస్తోంది. గదిలోకి రాగానే వాటంతటదే లైట్ ఆన్ అవుతుంది. వెళ్లిపోగానే ఆఫ్ అవుతుంది. టీవీ సౌండ్ పెంచినట్టుగా రిమోట్ సహాయంతో లైట్ వెలుతురు(లుమిన్స్)ను ఎక్కువ, తక్కువ చేసుకునే విధానం ఉంటుంది. వీటిలో ఇంకో విధానం కూడా ఉంది అది వెబ్ బేస్డ్ సొల్యుషన్స్ ఎల్‌ఈడీ లైట్స్. వీటిని ఇంటర్నెట్ సహాయంతో ఐ-ఫోన్, ఐప్యాడ్‌ల నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవి చాలా వరకు రెస్టారెంట్లు, పబ్బులు, గేమింగ్ జోన్లు, థియేటర్లు, షామింగ్ మాళ్లులో ఉపయోగిస్తారు.

ఎల్‌ఈడీ లైట్ల విద్యుత్ వినియోగం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. కానీ, బల్బు, సీఎఫ్‌ఎల్, ట్యూబ్‌లైట్లతో పోల్చుకుంటే ఎల్‌ఈడీ లైట్ల ధర కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. వీటి ధర ప్రస్తుతం 18 ఓల్టుల లైట్ ధర రూ. 1,500 నుంచి -1,800 వరకు ఉంటుంది. 1,000 చ.అ. ఇంటికి రూ.8 లక్షలతో వెబ్ బేస్డ్ సొల్యుషన్స్ ఎల్‌ఈడీ లైట్లను అమర్చుకోవచ్చని, 300 గజాల ఇండిపెండెంట్ హౌజ్ గార్డెనింగ్‌కు రూ. 3 లక్షలు ఖర్చవుతుందని, ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఫంక్షన్ హాల్‌కు రూ. 40 లక్షలు, షాపింగ్ మాళ్లకు చదరపు అడుగుకు రూ. 500 నుంచి రూ. 1,000 వరకు ఖర్చవుతుంది. ఇప్పుడు చాలా వరకు ఇల్లు కట్టుకునే వారు వారికి నచ్చిన లైట్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడ ఇవి రోడ్లపై కూడా చాలా ప్రదేశాల్లో ఈ ఎల్‌ఈడీ లైట్లను వాడుతున్నారు. ప్రభుత్వం కూడా వీటి వినియోగం ఎక్కువ చేసేందుకు కృషి చేస్తుంది.

Comments

comments

Related Stories: