ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్

స్కార్పియో కారులో ఎత్తుకెళ్లినముగ్గురు యువకులు పోలీసులఅదుపులో స్కార్పియో కారు,నిందితుడు ఇంకా ఆచూకీలేని బాధితురాలు, మరో ఇద్దరు కిడ్నాపర్లు రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు మన తెలంగాణ/సిటీబ్యూరో: సర్టిఫికెట్లు జిరాక్స్ తీసేందుకు నడుచు కుంటూ వెళ్తున్న ఓ ఇంటర్ విద్యార్థినిని స్కార్పియో వాహనంలో వచ్చిన ముగ్గు రు యువకులు పట్టపగలు నడిరోడ్డుపై కి డ్నాప్ చేశారు. పోలీసులు ఆరాతీయగా స్కార్పియో యజమానితోపాటు వాహనా న్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కిడ్నాప్‌కు గురైన విద్యార్థినితోపాటు మ రో ఇద్దరు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. ఆలస్యంగా […]

స్కార్పియో కారులో ఎత్తుకెళ్లినముగ్గురు యువకులు

పోలీసులఅదుపులో స్కార్పియో కారు,నిందితుడు

ఇంకా ఆచూకీలేని బాధితురాలు, మరో ఇద్దరు కిడ్నాపర్లు

రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు

మన తెలంగాణ/సిటీబ్యూరో: సర్టిఫికెట్లు జిరాక్స్ తీసేందుకు నడుచు కుంటూ వెళ్తున్న ఓ ఇంటర్ విద్యార్థినిని స్కార్పియో వాహనంలో వచ్చిన ముగ్గు రు యువకులు పట్టపగలు నడిరోడ్డుపై కి డ్నాప్ చేశారు. పోలీసులు ఆరాతీయగా స్కార్పియో యజమానితోపాటు వాహనా న్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కిడ్నాప్‌కు గురైన విద్యార్థినితోపాటు మ రో ఇద్దరు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సం ఘటన సైదాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యువతి (17) చదువు నిమిత్తం సైదాబాద్‌లోని వినయ్‌నగర్‌లో గది అద్దెకు తీసుకుని బంధువులతో కలిసి ఉంటుంది. నగరంలోని ఓ కళాశాలలో ఇటీవలే ఇంటర్ సెకండియర్ పాస్ అయ్యిం ది. ఎంసెట్ ఎంట్రన్స్ కూడా రాసింది. ఇక కౌన్సిలింగ్ కోసం తన దగ్గర ఉన్న సర్టిఫి కెట్లను జిరాక్స్ తీసేందుకు ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు వినయ్ నగర్ నుంచి జిరాక్స్ సెంటర్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా వైట్ స్కార్పియో (ఏపీ10 ఏజే 3663) వాహనంలో వచ్చిన ముగ్గురు యు వకులు ఆ విద్యార్థినిని కిడ్నాప్ చేసి తీసు కెళ్లారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు హుటాహుటిన సైదా బాద్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో స్కార్పియో వాహనం నెంబర్ వెలుగు చూడడంతో కొత్తపేటలో ఉంటున్న ఆ వాహన యజమాని ఆసీఫ్(30)తో పాటు స్కార్పియో వాహనాన్ని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. విద్యార్థినిని తనతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలం ఇర్వేన్ గ్రామానికి చెందిన రషీద్ (24), కారు డ్రైవర్ నిసార్ (25) కిడ్నాప్ చేశారని విచారణలో ఆసీఫ్ వెల్లడించాడు. కిడ్నాప్ జరిగిన రాత్రి కొత్తపేటలోని తన గదిలోనే విద్యార్థినిని నిర్బంధించామని అంగీకరించాడు. ఆసీఫ్ ఇచ్చిన సమాచారం మేరకు కిడ్నాప్ కేసు మిస్టరీ విప్పేందుకు విద్యార్థినిని క్షేమంగా రక్షించేందుకు సైదాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. విద్యార్థినికి ఎలాంటి హాని తలపెట్టవద్దని బాధిత కుటుంబ సభ్యులు కిడ్నాపర్లకు విజ్ఞప్తి చేశారు. పరారీలో ఉన్న కిడ్నాపర్లు రషీద్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఓ పోలీసు బృందం అతని కోసం మహబూబ్‌నగర్ కూడా వెళ్లింది.

Comments

comments

Related Stories: