హైదరాబాద్ : కొత్తపేటలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఓ ప్రముఖ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అర్చన అనే విద్యార్థిని కాలేజీ హాస్టల్లోని తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన హాస్టల్ సిబ్బంది కొన ఊపిరితో ఉన్న అర్చనను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అర్చన చనిపోయిందని వైద్యులు తెలిపారు. నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్‌కు చెందిన అర్చన కాలేజీలో చదువుతూ కాలేజీ హాస్టల్లో ఉంటుంది. రాఖీ పండుగను పురస్కరించుకుని ఇంటికి వెళ్లిన అర్చన మంగళవారం ఉదయం హాస్టల్‌కు తిరిగొచ్చింది. హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం కోసం అర్చన మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.