ఇంగ్లాడ్ 332 ఆలౌట్…

England 332 all out against India in fifth Test

లండన్: భారత్ తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టు ఇంగ్లాడ్ 332 పరుగులకు ఆలౌటైంది.  198/7 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాడ్ కొద్దిసేపటికే రషీద్ 15(51) వికెట్ ను కోల్పోయింది. బుమ్రా బౌలింగ్ లో రషీద్ ఎల్బీగా వెనుదిరిగాడు. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆతిథ్య జట్టుకు బ్రాడ్‌ 38(59)తో కలిసి బట్లర్‌ 89(133) ఊపిరిలూదాడు. భారత బౌలర్లకు మరో అవకాశం ఇవ్వకుండా ఆచితూచి ఇన్నింగ్స్‌ ఆడారు. వీరిద్దరూ 9వ వికెట్‌కు ఏకంగా 98 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని జోడించారు.భారత బౌలర్లకు కఠిన పరీక్షను పెట్టిన ఈ జోడీ క్రీజులో పాతుకుపోవడంతో లంచ్‌ విరామానికి ఇంగ్లాండ్‌ 300 పరుగుల మైలు రాయిని చేరింది.  అయితే, భోజన విరామానంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ కేవలం మరో 32 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో జడేజాకు నాలుగు వికెట్లు, బుమ్రా, ఇషాంత్‌ శర్మ చెరో మూడేసి వికెట్లు దక్కించుకున్నారు.