ఆ హీరోతో రెండోసారి

Tamanna

మిల్కీబ్యూటీ తమన్నా కెరీర్ నిదానంగా సాగుతోందని… ఇక ఆమె పని అయిపోయిందని ఈమధ్య ఓ టాక్ వినిపించింది. అయితే అది నిజం కాదు. ఎందుకంటే ‘క్వీన్’ తెలుగు రీమేక్‌తో పాటు ఎఫ్2, సైరా సినిమాలు, కునాల్ కోహ్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది ఈ భామ. ఇవి కాకుండా తమిళంలో ‘కన్నె కలైమాని’ అనే సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. అయితే తాజాగా సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ కొత్త ప్రాజెక్టులో కూడా తమన్నా హీరోయిన్‌గా ఎంపికైంది. ట్రైడెంట్ ఆర్ట్ వారు నిర్మించే ఈ సినిమాలో విశాల్ హీరో. ఇక విశాల్‌తో తమన్నా నటించడం ఇది రెండోసారి. ఈ యాక్షన్ మూవీని వచ్చే ఏడాది జనవరిలో సెట్స్‌పైకి తీసుకెళ్తారట. సుందర్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది తమన్నా. అంతేకాదు ఈ సంవత్సరమంతా డిఫరెంట్ సినిమాల్లో నటించే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొంది ఈ బ్యూటీ.

Comments

comments