ఆ యువకుడి ఒంటి నిండా రోగాలే

కప్పిపుచ్చి పెళ్లి చేసిన తల్లిదండ్రులు వైవాహిక జీవితానికి పనికిరాని వరుడు బాధితురాలి కుటుంబ సభ్యుల ఆందోళన న్యాయం కోసం పోలీసులకు తండ్రి ఫిర్యాదు చాంద్రాయణగుట్ట: ఆ యువకుడికి ఒంటి నిండా రోగాలు. అయితేనేమి తల్లిదండ్రులు ఆ విషయాన్ని దాచిపెట్టి తన కుమారుడికి ఉన్నత చదువులు చదువుకున్న ఒక యువతితో వివాహం జరిపించారు. వారి సంసార జీవితం పట్టుమని మూడు నెలలు కూడా సాగకముందే ఆ యువకుడు వైవాహిక జీవితానికి పనికిరాడని తేలింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు, […]

కప్పిపుచ్చి పెళ్లి చేసిన తల్లిదండ్రులు
వైవాహిక జీవితానికి పనికిరాని వరుడు
బాధితురాలి కుటుంబ సభ్యుల ఆందోళన
న్యాయం కోసం పోలీసులకు తండ్రి ఫిర్యాదు

చాంద్రాయణగుట్ట: ఆ యువకుడికి ఒంటి నిండా రోగాలు. అయితేనేమి తల్లిదండ్రులు ఆ విషయాన్ని దాచిపెట్టి తన కుమారుడికి ఉన్నత చదువులు చదువుకున్న ఒక యువతితో వివాహం జరిపించారు. వారి సంసార జీవితం పట్టుమని మూడు నెలలు కూడా సాగకముందే ఆ యువకుడు వైవాహిక జీవితానికి పనికిరాడని తేలింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె అత్తింటి ఎదుట ఆందోళనకు దిగారు. చివరకు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలలోకి వెళితే… నిజామాబాద్‌కు చెందిన ఆంకార్ మహేష్, గంగామణిల కుమార్తె నందిని ఎంబిఎ చదువుకుంది. అందరు తల్లిదండ్రులలాగానే తమ కూతురికి వివాహం చేయదలచిన ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్ పాత బస్తీకి చెందిన గౌలికర్ హరిరాజ్, డాక్టర్ శ్యామల కుమారుడు హర్షవర్దన్‌తో మే 2వ తేదీ, 2018న నిజామాబాద్‌లోఅంగరంగ వైభవంగా జరిపించారు. కట్నకానుల క్రింద రూ.20 లక్షలను సమర్పించుకున్నారు. వరుడి ప్రవర్తన ఆదోళనకరంగా ఉండటంతో అనుమానం వచ్చిన నందిని విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు హర్షవర్దన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. హర్షవర్దన్ పెళ్ళికి ముందే 2017, ఫిబ్రవరి ఏడున కంచన్‌బాగ్ ఓవైసీ హాస్పిటల్లో స్పైన్ టెస్ట్ చేయించుకున్నాడు. డాక్టర్లు అతనికి వెన్నుముకలో సమస్య ఉన్నట్లు తెలిపారు.

2017, ఆగస్టు 27న గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ పరీక్ష చేయించుకున్నాడు. అతనికి 40 శాతం కిడ్నీలు పాడైనట్లు డాక్టర్లు వెల్లడించారు. 2018, జూలై 14న యశోద ఆసుపత్రిలో మరోసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోగా 80 శాతం కిడ్నీలు పనిచేయటం లేదని డాక్టర్ సురేష్ బాబు తెలిపారు. వరుడి కుటుంబ వైద్యుడైన డాక్టర్ రాజారాంను సంప్రదించగా హర్షవర్దన్ రెండు మూత్రపిండాలు పాడైపోయాయని, వాటిని మార్చినా ఫలితం లేదని స్పష్టం చేశాడు. పెళ్ళికి రెండు రోజుల ముందు ఏప్రిల్ 30, 2018న గ్లోబల్ హాస్పిటల్లో చేరినట్లు గుర్తించారు. వీటన్నింటికి తోడు బాల్యంలో జరిగిన గుండె ఆపరేషన్‌కు సంబంధించిన వైద్య చికిత్స నేటికి అపోలో హాస్పిటల్‌లోని కార్డియాలజిస్టు డాక్టర్ సురేష్ చేస్తున్నారు. వంటి నిండా రోగాలతో బాధపడుతున్న యువకుడికి గుట్ట చప్పుడు కాకుండా కుటుంబ సభ్యులు వివాహం జరిపించారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రులు గౌలికర్ హరిరాజ్, డాక్టర్ శ్యామల, సోదరి కె.పుష్పలీల-కె.మనోహర్, కూతురు డాక్టర్ బార్గవి, అశోక్‌కుమార్‌లు కలిసి తమ కూతురు నిండు జీవితాన్ని నాశనం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. నా కూతురు జీవితాన్ని నాశనం చేసిన వరుడు, అతని కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని తగిన శిక్ష విధించాలని, నా కూతురుకు న్యాయం చేయాలని ఆమె తండ్రి అంకార్ మహేష్ పోలీసులకు అందజేసే ఫిర్యాదులో కోరారు. కాగా ఛత్రినాక డీఐ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ మాత్రం ఈ విషయమై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

Comments

comments