ఆ మేరకే యాక్షన్ సీన్స్

Ram-Charan

మెగా హీరోలు ఏ సినిమా చేసినా కూడా ఎక్కువ శాతం కథలకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. ఇక రామ్‌చరణ్ నటించే ప్రతి సినిమా కథను ఒకటి, రెండు సార్లు చిరంజీవి విన్న తర్వాతే ఓకే చెబుతారని సినీ వర్గాల్లో టాక్ ఉంది. చరణ్ సినిమా స్క్రిప్టు విని ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే చిరంజీవి చెబుతూ ఉంటాడట. అయితే ‘రంగస్థలం’ విషయంలో మాత్రం పూర్తిగా దర్శకుడు సుకుమార్‌కు నిర్ణయాధికారం వదిలేశారు. సుకుమార్ ఆ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించడంతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో చరణ్ సినిమాలో విషయంలో మరీ ఎక్కువగా జోక్యం అవసరం లేదని… మంచి దర్శకుల చేతి లో సినిమా పడితే తప్పకుండా బాగుంటుందనే నిర్ణయానికి చిరంజీవి వచ్చినట్లుగా తెలిసింది. అందుకే చరణ్ ప్రస్తుతం చేస్తున్న బోయపాటి శ్రీను చిత్రం విషయంలో కూడా ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు. బోయపాటి రెడీ చేసిన స్క్రిప్ట్‌ను విన్న చిరంజీవి మార్పులేవీ చెప్పకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. సినిమా ప్రారంభ సమయంలో యాక్షన్ సీన్స్‌ను కాస్త లిమిట్స్‌తో చేయమని మాత్రమే సల హా ఇవ్వడం జరిగిందట. దీంతో చరణ్ బాడీ లాంగ్వేజ్, ఇమేజ్‌కు తగ్గట్లుగా యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుతం అజైర్‌బైజాన్‌లో రామ్‌చరణ్ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ యాక్షన్ ఎపిసోడ్‌తో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా తెలిసింది. చిరు సలహా మేరకు దర్శకుడు బోయపాటి శ్రీను తన మార్క్ కు భిన్నంగా యాక్షన్ ఎపిసోడ్స్‌ను లిమిట్స్‌లో చేస్తున్నట్లుగా తెలిసింది. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వాని నటిస్తోంది.