ఆ నిధుల సంగతేంటి?

Release of 14th Finance Commission for Panchayats

పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధుల విడుదల                                                                                                జిల్లాకు రూ. 14 కోట్లు మంజూరు                                                                                                                      పాలకవర్గాలకు పదవీకాలం 17 రోజులే                                                                                                ప్రత్యేకాధికారులకు పాలన పగ్గాలు                                                                                                                      దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే

మన తెలంగాణ/ఆదిలాబాద్: పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సం ఘం నిధులను మంజూరు చేసింది. జనాభా ప్రాతిపదికన కేటాయించే ఈ నిధులు జిల్లాకు రూ.14 కోట్లు వచ్చాయి. మరో 17 రోజుల్లో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ము గిసిపోతుండడంతో వచ్చిన నిధులు ప్రస్తుత సర్పంచ్‌లకు ఇస్తారా లేక త్వరలో నియమించే ప్రత్యేకాధికారులకు అప్పగిస్తారా అనే విషయం తేలాల్సి ఉండగా ఈ నిధులను గ్రామ పంచాయతీ ఖాతాలలో జమ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలోని 243 గ్రా మ పంచాయతీల ఖాతాలలో ఈ నిధులు మరో రెండు రోజుల్లో జమ చేయనున్నారు. అయితే ఈ నిధులు పదవీ కాలం ముగిసే సర్పంచులు దుర్వినియోగం చేసే అవకాశాలు ఉండడంతో నిధులపై ఆంక్షలు విధించే అవకాశాలున్నాయని అంటున్నారు. జనాభా ప్రాతిపదికన వచ్చిన నిధులను పాత పంచాయతీలకు కేటాయించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ఏటా కేంద్ర ప్రభు త్వం రెండు పర్యాయాలు నిధులను విడుదల చేస్తుంది. ఈయేడు ఫిబ్రవరిలో రాగా, మళ్లీ జూలైలో మంజూరయ్యాయి. గతంలో వచ్చిన నిధులకు ఈసారి వచ్చిన నిధులకు ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం పంచాయతీల పాలకవర్గం పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. వచ్చిన నిధులను పంచాయతీలకు కేటాయించలేదు. జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు పంపిణీ చేస్తారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు నిర్దేశించిన పనులను మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ నిధులు దుబారా చేయకుండా ప్రభుత్వం నిబంధన లు విధించింది. అందులో తాగునీటి సరఫరా, సీపీడబ్లూఎస్ నిర్వహణ, పైపులైన్ల మరమ్మత్తులు, నీటి ట్యాంకుల పరిసరాల్లో పారిశుద్దం, వీది దీపాల నిర్వహణ, ఫుల్‌పాత్‌లు, కల్వర్టులు, సీసీ రో డ్లు, అసంపూర్తి పంచాయతీ భవన నిర్మానం, బోర్ల మరమ్మత్తులకు వినియోగించాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీల పాలకవర్గం గడువు మరో 17 రోజుల్లో ముగిసిపోనుంది. పదవీకాలం చివర్లో కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులను కేటాయించింది. దీంతో ఈ నిధులు ఎలా ఖర్చు చేయాలనే దానిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆదారపడి ఉంది. గతంలో నిధులు వచ్చిన వెం టనే జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు కేటాయించినట్లుగానే ఈ సారి సైతం విడుదల చేస్తున్నప్పటికీ వాటిని ఖర్చు చేయకుండా ఆంక్షలు విధించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పాలకవర్గానికి గడువు ముగిసిపోతుండడంతో చేసిన పను ల్లో నాణ్యత లేకున్నా, నిధులు దుర్వినియోగం అయినా, ప్రజా స మస్యలు పడకేసే ప్రమాదముంది. ఈ విషయమై జిల్లా అధికారులు అచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశా లు వచ్చే వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. పదవీ కాలం చివరలో వచ్చిన నిధుల వినియోగంపై అంతటా చర్చ సాగుతుంది. ఇప్పటి వరకు మంజూరైన ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పదవీ కాలం చివరిలో వచ్చిన నిధులు సద్వినియోగం చేస్తారా అంటూ పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతసర్పంచులకే నిధులను కేటా యిస్తే వాటి వినియోగంపై నిఘా పెట్టాలని లేదంటే దుర్వినియో గమయ్యే అవకాశముందని పలువురుఆందోళన వ్యక్తంచేస్తున్నారు.