ఆ త‌ల్లి చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పించిన కెసిఆర్‌

KCR-IMAGE

ములుగు: గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండల కేంద్రం టిఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడు అంజిరెడ్డి మాతృమూర్తి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం ఆమె కుటుంబ సభ్యులు దశదిన కర్మ జరిపించారు. ఈ కార్యక్రమానికి సిఎం కెసిఆర్ హాజరయ్యారు. అంజిరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తరువాత అంజిరెడ్డి తల్లి చిత్రపటానికి పూలమాల వేసి సిఎం నివాళులర్పించారు.