ఆహా! ఏం ఐడియా బాసు..!!

హైదరాబాద్: వినాయక చవితి వచ్చిందంటే చాలు… భక్తులు వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ కోలాహలంగా జరుపుకుంటారు. మండపాలు నిర్మించడం, విఘ్నేశ్వరుడి ప్రతిమలను ప్రతిష్టించడం, ప్రత్యేక పూజలు ఇలా లంబోధరుడిని ప్రస్నన్నం చేసుకునేందుకు భక్తులు ఆరాటపడుతుంటారు. అంతా బాగానే ఉన్న అసలు సమస్య వినాయకుడి పూజకు అవసరమైన పూజా సామగ్రి, పత్రిని సేకరించడం వద్ద వస్తుంది. అసలు పూజకోసం ఏయే రకాల పత్రిని సేకరించాలో కూడా ఇప్పటికి చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. వాటి కోసం పడే పాట్లు వర్ణణాతీతం. […]

హైదరాబాద్: వినాయక చవితి వచ్చిందంటే చాలు… భక్తులు వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ కోలాహలంగా జరుపుకుంటారు. మండపాలు నిర్మించడం, విఘ్నేశ్వరుడి ప్రతిమలను ప్రతిష్టించడం, ప్రత్యేక పూజలు ఇలా లంబోధరుడిని ప్రస్నన్నం చేసుకునేందుకు భక్తులు ఆరాటపడుతుంటారు. అంతా బాగానే ఉన్న అసలు సమస్య వినాయకుడి పూజకు అవసరమైన పూజా సామగ్రి, పత్రిని సేకరించడం వద్ద వస్తుంది. అసలు పూజకోసం ఏయే రకాల పత్రిని సేకరించాలో కూడా ఇప్పటికి చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. వాటి కోసం పడే పాట్లు వర్ణణాతీతం. ఇక విచాయక చవితి రోజు గణేషుడి పూజకు వాడే పత్రులు ఇవేనంటూ రోడ్ల పక్కన విక్రయించే ఏవో ఆకులనే మరో ఆలోచన లేకుండా కొనేస్తాం. వినాయకుడిని పూజించే పత్రులపై సరియైన అవగాహన లేకపోయేసరికి వాటితోనే పూజలు చేసి మమ అనిపించేస్తాం. పల్లేల్లో అయితే అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంటాయి కనుక ఏ పత్రులు కావాలో వాటినే తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తుంటారు.

ఇక నగరాల్లో ఉండేవారికి పత్రులను సేకరించే విషయంలో తిప్పలు తప్పవు. ఇంకొందరు ఇవన్నీ ఎందుకులే దొరికిన వాటితోనే పని కానిస్తేపోలే అనుకుంటారు. ఇలా ఈ విషయంలో ఇక్కట్లు పడేవారి కోసం ఓ యువ టెక్కీ ఒక అద్భుతమైన ఆలోచనతో ఆన్ లైన్ ద్వారా ఈ సమస్యకు చక్కని పరిష్కారం చూపించాడు. ఒక్క క్లిక్ చేస్తే చాలు పూజకు కావాల్సిన వినాయకుడి ప్రతిమ, పత్రులతో సహా పూర్తి పూజ సామాగ్రిని అందుబాటులో ఉంచాడు. ‘ఆరాధ్య’ అనే ఆన్ లైన్ సంస్థ ద్వారా లంకొత్తు వేణుగోపాల స్వామి అనే యువ టెక్కీ  వినాయకుడి పూజకు అవసరమైన విగ్రహ ప్రతిమతో పాటు, 18 రకాల పూజా సామాగ్రి,   21 రకాల పత్రులను ఓ ప్యాక్ ద్వారా భక్తులకు అందిస్తున్నాడు. ఈ పూజా కిట్ ను పొందాలంటే www.aaradhyakit.com వెబ్ సైట్లోకి లాగిన్ అయి బుక్ చేసుకోవచ్చు. లేదా 9494563839 వాట్సాప్ నంబరును సంప్రదించవచ్చు. గురువారం, 13వ తేదీన వినాయకచవితి పర్వదినం ఉండగా, పూజా కిట్ ను ఆర్డర్ చేసుకున్న వారికి 12వ తేదీ బుధవారం నాడు డెలివరీ ఇస్తామని సంస్థ ప్రకటించింది. అయితే, ఇప్పుడు కేవలం హైదరాబాద్ నగర పరిధిలో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది.

మూడు రకాల ప్యాకేజీల్లో ఆరాధ్య కిట్ అందుబాటులో ఉంటుంది. మట్టితో తయారైన 9 అంగుళాల విగ్రహం, 21 రకాల పత్రి, 18 రకాల పూజా సామాగ్రిని రూ. 999కు అందిస్తున్నట్టు వేణుగోపాల స్వామి వెల్లడించారు. అలాగే రూ. 888కి ఆరు అంగుళాల వినాయకుడి ప్రతిమ, 21 రకాల పత్రి, 18 రకాల పూజా సామాగ్రిని, రూ. 499కి ఆరు అంగుళాల ప్రతిమ, పత్రిని అందిస్తున్నట్లు తెలిపారు. నగర పరిధిలో డోర్ డెలివరీ సదుపాయం కూడా ఉంది.

21 రకాల పత్రిలో భాగంగా మాచీ పత్రం, బృహతి పత్రం, బిల్వ పత్రం, దుర్వార పత్రం, దాత్తూర పత్రం, బదరీ పత్రం, అపామార్గ పత్రం, తులసి పత్రం, చూత పత్రం, కరవీర పత్రం, విష్ణుకాంత పత్రం, దామినీ పత్రం, దేవదారు పత్రం, మరువక పత్రం, సింధువార పత్రం, జాజి పత్రం, గండకీ పత్రం, షమీ పత్రం, అశ్వథ పత్రం, అర్జున పత్రం, అర్క పత్రం ఈ కిట్ లో లభిస్తాయి.

పూజకు అవసరమయ్యే పసుపు, కుంకుమ, గంధం, ముగ్గు, అక్షింతలు, కర్పూరం, కంకణం, వస్త్రం, యజ్ఞోపవీతం, సాంబ్రాణి, దీపాలు, నూనె, వత్తులు, తేనె, పంచదార, ఆవునెయ్యి, గంగాజలం, అగరుబత్తి, తాంబూలం, పాలవెల్లి, కొబ్బరికాయ, పూజా విధానం పుస్తకం ఈ కిట్ లో లభిస్తాయి. సో… గణేషుడి పూజ సామాగ్రి, పత్రుల గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చుని ఒక్క క్లిక్ చేస్తే చాలు క్షణాల్లో వినాయకుడి ప్రతిమతో సహా పూర్తి పూజ సామాగ్రి ముంగిట్లో ఉంటుంది. ఈ అద్భుత ఐడియాతో వేణుగోపాల స్వామి విఘ్నేశ్వరుడి భక్తుల తిప్పలను తరిమికొట్టాడనే చెప్పాలి. ఇంకేందుకు ఆలస్యం మీరూ ఆరాధ్య సైట్ లో లాగిన్ అయి పూజ సామాగ్రి ఆర్డర్ చేసుకుని గణనాధుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకోండి.

Comments

comments