ఆస్తి కోసం తండ్రిని చంపిన తనయుడు…

తుర్కపల్లి: ఆస్తి కోసం కన్న తండ్రిని చంపిన సంఘటన తుర్కపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఆస్తిల కోసం కన్న తండ్రులను చంపుతున్న మృగాలను ఎన్ని కఠినమైన శిక్షలు విధిస్తున్న కాని సమాజంలో మార్పు రావడం లేదని యాదాద్రిభువనగిరి జిల్లా డిసిపి రాంచంద్ర రెడ్డి అన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని గొల్లగూడెం గ్రామ పరిధిలోని మర్రికుంట తండాకు చెందిన ధీరావత్ జాలాంకు ఇద్దరు భార్యలు మొదటి భార్య సుగుణ, రెండవ భార్య లక్ష్మి. సుగుణకు ఇద్దరు […]

తుర్కపల్లి: ఆస్తి కోసం కన్న తండ్రిని చంపిన సంఘటన తుర్కపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఆస్తిల కోసం కన్న తండ్రులను చంపుతున్న మృగాలను ఎన్ని కఠినమైన శిక్షలు విధిస్తున్న కాని సమాజంలో మార్పు రావడం లేదని యాదాద్రిభువనగిరి జిల్లా డిసిపి రాంచంద్ర రెడ్డి అన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని గొల్లగూడెం గ్రామ పరిధిలోని మర్రికుంట తండాకు చెందిన ధీరావత్ జాలాంకు ఇద్దరు భార్యలు మొదటి భార్య సుగుణ, రెండవ భార్య లక్ష్మి. సుగుణకు ఇద్దరు కుమారులు మొదటివాడు భిక్షపతి, రెండవ కుమారుడు నరసింహ. రెండవ భార్య లక్ష్మి ఒక కొడుకు నరేందర్ (30) . జాలంకు 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నందున అట్టి వ్యవసాయ భూమిలో తనకు వాటా కావాలని కుటుంబ సభ్యులను చాలా ఇబ్బందులు గురి చేసేవాడు. అయితే తను నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నందున ఆస్తిలో వాటా ఇవ్వనని తండ్రి, అన్నయ్యలు తేల్చి చెప్పారు. వాటా లేదు అనడంతో వారిపై కక్ష పెంచుకొని నాలుగు సంవత్సరాల క్రితం అన్నయ్య నరసింహను హత్య చేసి జైలుకు వెళ్ళాడు. బెయిల్‌పై తిరిగి వచ్చి జనగామ జిల్లాలోని నర్మెట మండలంలో జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా కన్న తండ్రిపై కక్ష పెంచుకున్న నరేందర్ పథకం ప్రకారం… బుధవారం తన తండ్రి భువనగిరికి వెళ్ళి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా రుస్తాపుర్ గ్రామ సమీపంలో నరేందర్ తన వెంట తెచ్చుకున్న టాటా సుమోతో వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే జాలాం మృతి చెందాడు. అనంతరం నరేందర్ పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడని తెలిపారు. ఈ కార్యాక్రమంలో ఎసిపి శ్రీనివాసచార్యులు, సిఐ అంజయ్య, ఎస్ఐ వెంకటయ్య, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Stories: