ఆసక్తి రేకెత్తిస్తున్న ‘పేపర్ బాయ్’ట్రైలర్

హైదరాబాద్: సంపత్‌నంది టీమ్ వర్క్ బ్యానర్‌లో జయశంకర్ దర్శకత్వంలో సంపత్ నంది నిర్మిస్తున్న చిత్రం ‘పేపర్ బాయ్’. ప్రచిత్ర క్రియేషన్స్, బిఎల్‌ఎన్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్, రియా, తాన్య హోప్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్‌లో ‘ధరణి.. నేను చదివిన మొట్ట మొదటి కవిత.. ఈ మూడు అక్షరాలు నాకు పరిచయమైంది పుస్తకాల్లో.. దగ్గరైంది అక్షరాల్లో..’’, ‘‘ప్రేమంటే ఆక్సీజన్ లాంటిది.. అది కనిపించదు కానీ బతికేస్తుంది’’ , ‘‘ఈ […]

హైదరాబాద్: సంపత్‌నంది టీమ్ వర్క్ బ్యానర్‌లో జయశంకర్ దర్శకత్వంలో సంపత్ నంది నిర్మిస్తున్న చిత్రం ‘పేపర్ బాయ్’. ప్రచిత్ర క్రియేషన్స్, బిఎల్‌ఎన్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్, రియా, తాన్య హోప్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్‌లో ‘ధరణి.. నేను చదివిన మొట్ట మొదటి కవిత.. ఈ మూడు అక్షరాలు నాకు పరిచయమైంది పుస్తకాల్లో.. దగ్గరైంది అక్షరాల్లో..’’, ‘‘ప్రేమంటే ఆక్సీజన్ లాంటిది.. అది కనిపించదు కానీ బతికేస్తుంది’’ , ‘‘ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి ప్రపంచం ఒకేలా ఉండదంటారు. కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇద్దరి ప్రపంచం ఒకటే అనిపించింది’’, ‘ఏ అక్షరాలైతే మమ్మల్ని కలిపాయో.. అవే అక్షరాల్లోనే రాసుకున్నా.. తనకు శాశ్వతంగా దూరం కావాలని’’ అనే డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఈ చిత్రానికి భీమ్స్ స్వరాలు సమకుర్చారు. సౌందర్య రాజన్ మంచి విజువల్స్ అందించారు. సినిమాకు హైలైట్ సినిమాటోగ్రఫీ. మ్యూజిక్ కూడా బెస్ట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతుంది. “గోల్కొండ హైస్కూల్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన సంతోష్ ‘పేపర్‌బాయ్’ చిత్రంతో హీరోగా చేస్తున్నాడు.

Related Stories: