ఆషాలపై ప్రభుత్వానికి చిన్నచూపు తగదు: రాజయ్య

Goverment Solve The Aasha Workers Problems

మన తెలంగాణ/ సంగారెడ్డి టౌన్ ః ఆషా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సంఘం గౌరవ అధ్యక్షులు కె.రాజయ్య మాట్లాడుతూ ఆషాలను ఇంటికి పంపించే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఎన్.హెచ్.ఎం.స్కీంకు బడ్జెట్ పెంచాలని, ఆషాలను, కార్మికులుగా గుర్తించి, కనీస వేతనం రూ.18వేలు అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 12 సంవత్సరాలకు పైగా ఆషాలు పేద ప్రజలకు సేవలిందిస్తున్నారని, మాతా శిశు మరణాలను తగ్గించటం, ఆస్పత్రిలో డెలివరీల సంఖ్య పెంచటం, పోషకాహార లోపంపై అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. క్షయ, మలేరియా, బోధకాలతో పాటు సీజనల్‌గా వచ్చే వ్యాధులకు ప్రభుత్వం సప్లై చేసే మందులను ఎప్పటికప్పుడు ప్రజలకు పంపిణీ చేస్తున్నారని ఆయన తెలిపారు. పేద ప్రజలకు సేవలందిస్తున్న ఆషాలను ఉద్యోగం నుంచి తొలగించి ఇంటికి పంపించడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ఆషాలను ఇంటికి పంపించే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకొని పేదరికం, నిరుద్యోగం, పోషకాహార లోపం అధికంగా ఉన్న మన దేశంలో ఎస్.హెచ్.ఎం స్కీం యొక్క సేవలు పేద ప్రజలకు కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.18వేలు అమలు చేయాలని, ఇఎస్‌ఐ, పిఎఫ్ లాంటి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో మరిన్ని ఉదృత పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏవో సూపరింటెండెంట్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటియు నాయకులు సాయిలు, మొగులయ్య, వెంకట్‌రాజం, ప్రవీణ్, ఖాజా, స్వాతి, ఆష, నాయకులు శశిరేఖ, యశోధ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments