ఆలూర్ చెరువుపైనే ఆశలు!

If the pond is connected with the escerase water

ఎస్‌ఆర్‌ఎస్‌పికి అనుసంధానం చేస్తే మేలు
ఐదు గ్రామాల చెరువులకు జలకళ

మనతెలంగాణ/రాయికల్: ఒక్క చెరువును ఎస్సారెస్పీ నీటితో అనుసంధానం చేస్తే చాలు కింద ఉన్న ఐదు గ్రామాల చెరువులకు జలకళ సంతరించుకుంటుంది. గొలుసుకట్టు విధా నం వల్ల ఐదు గ్రామాల చెరువులకు నీరు చేరి వందలాదిఎకరాలకు సాగునీరు అందుతుంది. బీడు భూములు సాగులోకి వచ్చి అన్నదాతలకు లాభం చేకూరుతుంది. ఈ ఒక్క చెరువును ఎస్సారెస్పీ కెనాలు నీటికి అనుసంధా నం చేయాలని ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వా న్ని కోరుతున్నారు.ఎత్తు ప్రదేశంలో నిర్మితమైన ఆలూర్ కొత్త చెరువు పూర్తిగా నీటితో ని ండితే ఈ చెరువు నీరు ఉప్పుమడుగు, వీరాపూర్,రామాజీపేట,మూటపెల్లి, కొత్తపేట గ్రా మాల చెరువులకు చేరి జలకళ సంతరించుకుంటుంది. రాయికల్ మండలం ఆలూర్ కొ త్తచెరువుపై మన తెలంగాణ ప్రత్యేక కథనం. రాయికల్ మండలం ఆలూర్-రాజనగర్ గ్రా మాలకు ఈ చెరువే పెద్ద దిక్కు.  ఈ రెండు గ్రా మాల సమీపం నుండే ఎస్సారెస్పీ కాల్వనీరు ఇతర గ్రామాలకు చేరుతున్న ఈ గ్రామాల భూములకు ఎస్సారెస్పీ నీరు అందని ద్రాక్షనే అవుతుంది.అనేక ఏళ్లుగా ఈ రెండు గ్రామాల ప్రజలు ఎస్సారెస్పీ నీటి కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లే కుండా పోతుంది. ఈ గ్రామాల ప్రజలు వ్యవసాయబావులపైనేఆధారపడి వ్యవసాయం చే సుకుంటున్నారు.అయితే సమీపం నుండే ఎ స్సారెస్పీ కెనాలు ద్వారా నీళ్లు ఇతర గ్రామాలకు వెళ్లుతున్న దృష్టా ఇదే నీటిని కొత్త చెరువులోకి మళ్లిస్తే చెరువు నిండి ఇతర గ్రామాల చెరువులు జలకళను సంతరించుకుంటాయి. ఆలూర్ చెరువు నిండి మత్తడి దూకితే ఇదే గ్రా మంలోని గుడికుంట తర్వాత ఉప్పమడుగు కన్నయ్య చెరువు ఆనంతరం వీరాపూర్ హవ్వ చెరువు, పాత చెరువు, తిమ్మనకుంట నిండి రామాజీపేట పెద్ద చెరువలోకి వెళ్లుతాయి. త ర్వాత ఈ మత్తడి దూకితే మూటపెల్లి, కొత్తపేట గ్రామాల చెరువుల్లోకి నీరు చేరుతుంది.  అందుకే అధికారులు పూర్తి స్థాయిలో సర్వే జరపాలని ఈ గొలుసు కట్టు విధానం వల్ల ఇ తర గ్రామాల చెరువులకు నీరు చేరే పరిస్థితి ఉన్నదని గ్రామస్థులు చెప్పుతున్నారు. ఈ  కొ త్త చెరువు కేవలం వర్షాధారమే కావడం వల్ల ఆశించిన మేర నీరు ఉండటం లేదు. ఎత్తిపోతల వల్ల ఈ చెరువును ఎస్సారెస్పీ నీటితో ని ంపగలిగితే మత్తడి దూకి ఇతర గ్రామాల చెరువులకు లాభం కలుగుతుంది. ప్రభుత్వం ఆ లూర్ కొత్తచెరువుపై దృష్టిసారించాలని సర్పం చ్ మెక్కొండ రాంరెడ్డి, ఎంపిటిసి లాల్‌చావ్లా రాజేష్‌యాదవ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Comments

comments