ఆలివ్‌ఆయిల్ కోటింగ్ పాత్రలే మేలు

Olive Oil Coating On Stainless Steel is good

స్టీల్ పాత్రలు తయారు చేసినప్పుడు వాటిపై ఆలివ్ ఆయిల్, కార్న్ వంటి వాటి పల్చటి ఆయిల్ కోటింగ్ వేస్తే అవి పాత్రల్లో బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా నిరోధిస్తాయని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టొరొంటో శాస్త్రవేత్తలు వెల్లడించారు. వంటపాత్రలు గాఢత కలిగినడిటర్జంట్స్‌తో వాష్ చేయడంతో వాటివల్ల అనేక వ్యాధులు వస్తాయి. కుకింగ్ ఆయిల్ వంటి ఆలివ్ ఆయిల్ కోటింగ్ వేసిన పాత్రలు వంటకు మరింత మేలని సూచిస్తున్నారు. చూసేందుకు కనిపించకపోయినా మనం వాడే పాత్రల పగుళ్లలో అనేక వేల బాక్టీరియాలు స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటాయి. వీటిలో చేసిన వంటతో నేరుగా మన శరీరంలోకి చేరతాయి. సాల్మానెల్లో, లిస్టీరియా వంటి ఈకోలి బాక్టీరియాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ఫలితంగా మన జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ప్రతిరోజూ వాడే వంటపాత్రలు స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలైతే వీటిపైన ఆలివ్ కోటింగ్ ఉండేలా చూసుకోవాలి.