ఆర్ టి సి బస్సు ఢీకొని యువకుడి మృతి

Young man was killed in RTC bus accident
శామీర్‌పేట : ఆర్టీసి బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… యాదాద్రి జిల్లా మల్లాపూర్ గ్రామానికి చెందిన దేవరపల్లి అనిల్‌కుమార్(25) శామీర్‌పేట మండలం అలియాబాద్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అలియాబాద్‌లోని ఇండియన్ గ్యాస్ రిపేరింగ్‌లో సూపర్‌ వైజర్‌గా పని చేస్తున్న అనిల్ కుమార్ తన మిత్రుడు రంజిత్ కుమార్‌తో కలిసి పని నిమిత్తం శామీర్‌పేట వైపు వస్తుండగా మార్గ మధ్యలో హెచ్‌బిఎల్ రిక్వేస్ట్ బస్సు స్టాప్ వద్ద అతివేగంగా వచ్చిన హకీంపేట డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో అనిల్‌కుమార్ తలకు త్రీవ గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. రంజిత్ కుమార్ స్వల్పగాయలతో బయట పడ్డాడు. మృతుడికి భార్య శ్రావణి, ఓ కుమారుడు ఉన్నాడు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చరికి తరలించారు. ఈ మేరకు ఎస్‌ఐ నవీన్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు.