ఆర్‌బిఐ గడువు ముగిసింది..

న్యూఢిల్లీ : మొండి బకాయిల సమస్య పరిష్కారానికి గాను ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) బ్యాంకులకు ఇచ్చిన ఆరు నెలల గడువు నేటితో ముగిసింది. 70 అతిపెద్ద మొండి బకాయి ఖాతాల తుది రిసొల్యూషన్ ప్లాన్లు ఎంత వరకు వచ్చాయో తెలియాల్సి ఉంది. అయితే బ్యాంకులకు గడువు మాత్రం ముగిసింది. ఈ పెద్ద ఖాతాల్లో ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలే ఉన్నాయి. వీటి రుణాలు రూ.3 లక్షల కోట్లకుపైగా ఉన్నాయి. 180 రోజుల గడువు అంటే ఆగస్టు 27 […]

న్యూఢిల్లీ : మొండి బకాయిల సమస్య పరిష్కారానికి గాను ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) బ్యాంకులకు ఇచ్చిన ఆరు నెలల గడువు నేటితో ముగిసింది. 70 అతిపెద్ద మొండి బకాయి ఖాతాల తుది రిసొల్యూషన్ ప్లాన్లు ఎంత వరకు వచ్చాయో తెలియాల్సి ఉంది. అయితే బ్యాంకులకు గడువు మాత్రం ముగిసింది. ఈ పెద్ద ఖాతాల్లో ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలే ఉన్నాయి. వీటి రుణాలు రూ.3 లక్షల కోట్లకుపైగా ఉన్నాయి. 180 రోజుల గడువు అంటే ఆగస్టు 27 నాటికి వీటిని పరిష్కరించాల్సి ఉంది. సోమవారం నాటికి రిసొల్యూషన్ కాకపోతే ఎన్‌సిఎల్‌టిని ఆశ్రయించి, దివాలా చర్యలు చేపట్టాలి. ఆర్‌బిఐ సూచనల ప్రకారం, గడువు లోగా రుణాలను చెల్లించలేకపోతే దివాలా చట్టం కింద చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు)ను వెంటనే గుర్తించి, ఇచ్చిన గడువులోగా రిసొల్యూషన్ ప్లాన్ అమలు చేయాలి. ఈ విషయంలో విఫలమైతే బ్యాంకులపై జరిమానా పడనుంది. నిబంధనల ప్రకారం, బ్యాంకులు మొండి బకాయిలున్న ఖాతాలను వెంటనే గుర్తించి, వాటిపై రిజల్యూషన్ ప్లాన్(ఆర్‌పి) అమలు చేయాలి. అంటే ఖాతాదారులపై చర్యలు తీసుకోవడం, వారి నుంచి రుణాలు రాబట్టుకోవడం చేయాల్సి ఉంటుంది. 180 రోజుల్లోగా ఈ ప్రక్రియ ముగిసేలా చూడాలని ఆర్‌బిఐ గడువు విధించగా, ఇది ముగిసింది. గడువులోగా రిజల్యూషన్ ప్లాన్ పూర్తి కాకపోతే ఆయా బ్యాంకులు దివాలా కేసు కింద నమోదు చేయవచ్చు. అయితే అది కూడా గడువు పూర్తయిన 15 రోజుల్లోగానే నమోదు చేయాల్సి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంక్‌లు పెద్ద మొత్తంలో మొండి బకాయిలను రద్దు చేశాయి. ఆర్‌బిఐ అంచనాల ప్రకారం, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల(ఎన్‌పిఎ) విలువ బారీగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది.

Related Stories: