ఆర్‌టిసి బస్సు కిందపడి మహిళ మృతి..!

జగిత్యాల: ఆర్‌టిసి బస్సు కిందపడి ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన జగిత్యాల రూరల్ మండలం తక్కలపెళ్లిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మహిళ బస్సు కిందపడటంతో అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతురాలిని సంగంపెళ్లికి చెందిన ఎంబటి గంగవ్వగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో మృతురాలి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. Comments comments

జగిత్యాల: ఆర్‌టిసి బస్సు కిందపడి ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన జగిత్యాల రూరల్ మండలం తక్కలపెళ్లిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మహిళ బస్సు కిందపడటంతో అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతురాలిని సంగంపెళ్లికి చెందిన ఎంబటి గంగవ్వగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో మృతురాలి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

comments

Related Stories: