ఆర్థరైటిస్‌కు వయోపరిమితి లేదు.. శస్త్రచికిత్సే ఏకైకమార్గం

వాహనానికి షాక్ అబ్జార్వర్స్ ఉన్నట్లు మోకాలికి మృదులాస్థితి ఉంటుంది. మృదులాస్థితి లోపిస్తే కీళ్లనొప్పులతో నడవలేని స్థితి ఏర్పడుతుంది. ఈ నొప్పులు వయసు మీద పడుతున్న వారికే కాదు ఇటీవల యువత కూడా మోకాళ్ళ నొప్పులతో తల్లడిల్లుతున్నారు. మృదులాస్థితి(కాట్రిలేజ్) తీవ్రతకు అనేక కారణాలు ఉన్నాయి. తీవ్ర బాధను భరిస్తూ అడుగులు వేసే స్థితి కి చేరే ఈ నొప్పులు కీళ్ళ మధ్య గ్యాప్ ఏర్పడటంతో వస్తాయి. పరిస్థితి విషమించక ముందే శస్త్రచికిత్సలు అనివార్యమంటున్న ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్. […]

వాహనానికి షాక్ అబ్జార్వర్స్ ఉన్నట్లు మోకాలికి మృదులాస్థితి ఉంటుంది. మృదులాస్థితి లోపిస్తే కీళ్లనొప్పులతో నడవలేని స్థితి ఏర్పడుతుంది. ఈ నొప్పులు వయసు మీద పడుతున్న వారికే కాదు ఇటీవల యువత కూడా మోకాళ్ళ నొప్పులతో తల్లడిల్లుతున్నారు. మృదులాస్థితి(కాట్రిలేజ్) తీవ్రతకు అనేక కారణాలు ఉన్నాయి. తీవ్ర బాధను భరిస్తూ అడుగులు వేసే స్థితి కి చేరే ఈ నొప్పులు కీళ్ళ మధ్య గ్యాప్ ఏర్పడటంతో వస్తాయి. పరిస్థితి విషమించక ముందే శస్త్రచికిత్సలు అనివార్యమంటున్న ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్. రామ్‌మోహన్ రెడ్డి (ఎం.ఎస్ లండన్)తో పల్స్ ప్రత్యేక ఇంటర్యూ….

మోకాలికి తీవ్రమైన నొప్పి రావడంతో పాటు బిగుసుకు పోయినట్లు అనిపిస్తుంది. వాపు వంటి లక్షణాలు
కనిపిస్తే కీళ్లలో సమస్య ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.

ఆధునిక సమాజ పోకడలతో శరీరానికి కావల్సిన డి విటమిన్ దూరమవుతోంది. శరీరానికి అలసట తెలియకుండా ఏసీ గదులకు పరిమితమవుతున్నారు. వ్యాయాయం లేని వారికి ఆధునికంగా అనేక రోగాలు దాడి చేసేందుకు సిద్ధమవుతుంటాయి. అలాంటి వ్యాధుల్లో మోకాళ్ళ నొప్పులు ఒకటి, ఈ నొప్పులను తొలిదశలో మందులతో నివారించినా దీర్ఘకాలికంగా శస్త్ర చికిత్స అనివార్యమవుతుంది.

మృదులాస్థితి(కాట్రిలేజ్)ఉత్పత్తికి విస్కో సప్లిమెంట్ ఇంజెక్షన్ పనిచేస్తుందా?
ఈ రసాయనం (హియాల్యూరోనిక్ యాసిడ్) ఇంజెక్షన్ చేయడంతో కీళ్ళలో ఉండే మృదులాస్థితి ఉద్ధీపన చెందుతుంది. తిరిగి ఉత్పత్తి అవుతుంది. ఆర్థరైటిక్ జాయింట్స్‌లో యథాస్థితి చేకూరుతుంది. కానీ శాస్త్రీయమైన ఆధారాలు ఈ సిద్ధాంతానికి అనుకూలంగా లేవు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లినికల్ రీసెర్చి, అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ చేసిన అధ్యయనంతో ఈ విస్కోసప్లిమెంట్ ఇంజెక్షన్ ప్రయోగాత్మకమని చెప్పొచ్చు. ఈ ఇంజెక్షన్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదని నిర్ధారణ అయినప్పటికీ డాక్టర్లు రోగికి ఈ ఇంజెక్షన్ ఇచ్చే ముందు రోగితో లేదా రోగికి సంబంధించిన వారితో తప్పనిసరిగా చర్చించాలి.

మోకాలి ఆర్థరైటిస్‌కు స్టెమ్ సెల్ థెరఫీ పనిచేస్తుందా?
మోకాలి ఆర్థరైటిస్‌కు స్టెమ్ సెల్ థెరపీ పనిచేస్తుందనే ఆధారాలు కూడా ఇప్పటివరకు లేవు. మృదులాస్థి కణజాలం ఉత్పత్తి కావడానికి స్టెమ్ సెల్స్ దోహదపడుతుందని నిర్దారణ కాలేదు. స్టెమ్ సెల్స్ అనేవి కార్డియాక్, న్యూరలాజికల్ సమస్యలు వాటిల్లినప్పుడు అవసరమవుతుంది. కొన్ని మెడికల్ సెంటర్లలో రోగుల సొంత ప్లేట్‌లెట్స్ మోకాలి కీళ్లలో ఇంజెక్ట్ చేస్తారు. దీనితో ఆర్థరైటిస్ చికిత్స లభిస్తుంది. ప్లేట్‌లెట్స్ ఇంజెక్ట్ చేయడంతో ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు, పురోగతి చెందిన మోకాలి ఆర్థరైటిశ్ చికిత్సకు సంబంధించి సరిపడినంత సమాచారం లేదు. డాటా కూడా అందుబాటులో లేదు. ఇది చాలా ఖరీదుతో కూడుకుంది.

కీలు మార్పిడి ఎప్పుడు చేయవచ్చు?
ఏదేని వ్యక్తికి తీవ్రమైన నొప్పి వాటిల్లడంతో నిద్రా భంగం వాటిల్లడంతో పాటు బిగుసుకు పోయినట్లు అనిపిస్తుంది. వాపు వంటి లక్షణాలు కనిపిస్తే కీళ్లలో సమస్య ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఒక కిలోమీటరు కంటే తక్కువదూరం నడవలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే కీలు మార్పిడి అవసరం. ఎక్స్‌రే తీస్తే కీళ్ల మధ్య తరుగుదల ఎక్కువ ఉండటమే గాక గ్యాప్ ఎక్కువ ఉన్నట్లయితే రోగికి చికిత్స అవసరం. దైనందిన కార్యకలాపాలు సరిగ్గా చేసుకునే పరిస్థితి ఉంటే మాత్రం సర్జరీ అవసరంలేదు.

ఎలాంటి కీలు మార్పిడి అవసరం?
హైప్లెక్స్ రిప్లేస్‌మెంట్స్ అనేది మంచి కదలికలు ఉన్న కీలు మార్పిడి చికిత్స అని చెప్పవచ్చు. ఈ చికిత్సలో 0 నుంచి 150 డిగ్రీల వరకు కదలికలు ఉంటాయి. నేల మీద కూర్చోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ చికిత్స మంచిది. కొన్నిరకాల హైప్లెక్స్ డిజెన్స్ ఉన్న చికిత్సలు సంక్లిష్టమైనవిగా చెప్పుకోవచ్చు. రోగి అధిక బరువు కలిగి ఉన్నాడా? తక్కువ బరువు ఉన్నాడా? తెలుసుకుని చికిత్స ప్రారంభించాలి. అలాగే ఇంప్లాంట్ అమరిక తదితర విషయాలు అవసరం. స్టాండర్డ్ లేదా కన్వెన్షనల్ ని రిప్లెస్‌మెంట్ స్టీల్ లో వాడతారు. ఇందులో క్రోమియం, ఆక్సినియం వంటి లోహాలు వినియోగిస్తారు. ఈ ఇంప్లాంట్ దీర్ఘకాలంలో బాగా పనిచేస్తుంది. ఆక్సినియంతో ఎటువంటి సమస్యలు రావు. ఆక్సినియం లేదా సెరామిక్ రీప్లేస్‌మెంట్ అనేది స్టాండర్డ్ డిజైన్‌కు రూ. 25 వేల వరకు అవసరమవుతుంది. బయోమెడికల్ లాబ్‌లో ఈ పరీక్షలు చేస్తారు. ఆక్సినియం వల్ల దాదాపు 30 సంవత్సరాలకు తక్కువ కాకుండా జీవించవచ్చు. స్టాండర్డ్, ఆక్సినియంతో మంచి ఫలితాలు వస్తాయి. దీర్ఘకాలంలో ఈ ఇంప్లాంట్ ప్రయోజనాలు ఉంటాయి.

కంప్యూటర్ నేవిగేషన్ రిప్లేస్‌మెంట్ ప్రయోజనాలు ఎలా ఉంటాయి?
ఇంప్లాంట్ అమర్చడంలో సర్జన్‌కు కంప్యూటర్ నావిగేషన్ ఉపయోగపడుతుంది. కొలతలు శాస్త్రీయంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంప్లాంట్స్ అమర్చడంలో ఇబ్బందులు వాటిల్లితే కంప్యూటర్ నావిగేషన్ గైడ్ మాదిరిగా ఉపయోగపడుతుంది. మోకాలి మార్పిడి శస్త్రచికిత్సతో మెజారిటీ రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యకర జీవన శైలితో ఆర్థరైటిస్ వ్యాధి నుంచి బయటపడవచ్చు.

                                                                                                                                                    – వి.భూమేశ్వర్
మన తెలంగాణ ప్రతినిధి

Comments

comments