ఆర్చరీలో ఇండియాకు రెండు పతకాలు

జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత క్రీడకారుల పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ విభాగంలో భారత్ రజత పతకం సాధించింది. ఇండియన్ టీమ్‌ ముస్కన్ కిరార్, మధుమితా, జ్యోతి సురేఖలు సిల్వర్ మెడల్ సాధించారు. ఫైనల్లో దక్షిణ కొరియా చేతిలో భారత్ 228-231 స్కోర్‌తో పరాజయం పొందడంతో తృటిలో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుంది. మరోవైపు పురుషుల ఆర్చరీ విభాగంలో కాంస్యం దక్కింది. ఇండియా పతకాల సంఖ్య 43కి చేరింది. వీటిలో 8 స్వర్ణం, […]

జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత క్రీడకారుల పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ విభాగంలో భారత్ రజత పతకం సాధించింది. ఇండియన్ టీమ్‌ ముస్కన్ కిరార్, మధుమితా, జ్యోతి సురేఖలు సిల్వర్ మెడల్ సాధించారు. ఫైనల్లో దక్షిణ కొరియా చేతిలో భారత్ 228-231 స్కోర్‌తో పరాజయం పొందడంతో తృటిలో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుంది. మరోవైపు పురుషుల ఆర్చరీ విభాగంలో కాంస్యం దక్కింది. ఇండియా పతకాల సంఖ్య 43కి చేరింది. వీటిలో 8 స్వర్ణం, 13 రజతం, 22 కాంస్యం ఉన్నాయి. 43 పతకాలతో భారత్ పతకాల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.

 

Comments

comments