ఆరునెలల లాస్యకు అంతులేని వ్యాధి

The endless disease of a six-month lasya

సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్‌కు చెందిన ఆరునెలల అర్షనపల్లి లాస్యకు లీవర్ సంబంధిత వ్యాధి సోకి ఇబ్బంది పడుతోంది. ప్రగతినగర్‌కు చెందిన పవర్‌లూం వర్కర్ అర్షనపల్లి శ్రీధర్ దంపతులకు లాస్య ఆరునెలల క్రితం జన్మించింది. అయితే పాప జన్మించినప్పటి నుండి లీవర్ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. లాస్యను తల్లితండ్రులు అనేక మంది వైద్యుల వద్దకు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి వెళ్లగా లాస్యకు లీవర్ ప్లాంటేషన్ చేయాలని, దాదాపు 40 లక్షల రూపాయల వరకు వ్యయం అవుతుందని తెలపడంతో దిక్కుతోచని స్థితిలో శ్రీధర్ దంపతులు కొట్టుమిట్టాడుతున్నారు. తమ స్థాయిలో అంత ఖరీదైన వైద్యం చేయించలేమని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తమను కరుణించి సహకరించాలని కోరుతున్నారు. లాస్య ఆరోగ్య పరిస్థితి మాత్రం రోజురోజుకు క్షీణిస్తోంది.

Comments

comments