ఆయనతో అలాంటిదేమి లేదు..!

తెలుగులో మంచి పేరు సంపాదించి బాలీవుడ్లో సినిమాలు తీసిన ఈ తరం దర్శకుల్లో క్రిష్ ఒకడు. అతను ఇంతకుముందే ‘గబ్బర్’ అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. అది ఆడకపోయినా.. ఈసారి ‘మణికర్ణిక’ లాంటి మెగా ప్రాజెక్టును దక్కించుకున్నాడు. వంద కోట్లకు పైగా బడ్జెట్లో కంగనా రనౌత్ లాంటి టాప్ హీరోయిన్‌తో అతను ఈ సినిమాను మొదలు పెట్టాడు. అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికే ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ అనివార్య కారణాలతో సినిమా వాయిదా […]

తెలుగులో మంచి పేరు సంపాదించి బాలీవుడ్లో సినిమాలు తీసిన ఈ తరం దర్శకుల్లో క్రిష్ ఒకడు. అతను ఇంతకుముందే ‘గబ్బర్’ అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. అది ఆడకపోయినా.. ఈసారి ‘మణికర్ణిక’ లాంటి మెగా ప్రాజెక్టును దక్కించుకున్నాడు. వంద కోట్లకు పైగా బడ్జెట్లో కంగనా రనౌత్ లాంటి టాప్ హీరోయిన్‌తో అతను ఈ సినిమాను మొదలు పెట్టాడు. అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికే ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ అనివార్య కారణాలతో సినిమా వాయిదా పడింది. ఔట్ పుట్ విషయంలో చిత్ర నిర్మాతలు, హీరోయిన్ కంగనా సంతృప్తి చెందలేదని.. రీషూట్లు జరుగుతున్నాయని.. దర్శకుడు క్రిష్ ప్రమేయం లేకుండా ఈ వర్క్ నడుస్తోందని.. ఈ విషయమై కంగనకు, క్రిష్‌కు విభేదాలు కూడా తలెత్తాయని.. ఇలా రకరకాల ఊహాగానాలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. క్రిష్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ‘యన్.టి.ఆర్’ సినిమా తీసుకుంటున్నాడు.
ఐతే ఈ రూమర్లపై కంగనా బాలీవుడ్ మీడియాతో మాట్లాడింది. క్రిష్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. తాను, క్రిష్ ‘మణికర్ణిక’ విషయంలో ప్రతి రోజూ మాట్లాడుకుంటున్నామని ఆమె వెల్లడించింది. ‘మణికర్ణిక’ సినిమాను జనవరి 26న రిలీజ్ చేయాలని అనుకున్నామని.. కానీ అదే నెలలో క్రిష్ తెలుగు సినిమా రిలీజ్ కావాల్సి ఉందని.. ఆ సినిమాకు క్రిష్ డేట్లు కేటాయించడంతో ‘మణికర్ణిక’పై దృష్టి పెట్టలేకపోతున్నారని కంగనా వెల్లడించింది. ‘మణికర్ణిక’కు రిలీజ్ డేట్ విషయంలో మరో ఛాయిస్ కూడా ఉందని.. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన ఈ చిత్రాన్ని రిలీజ్ చేద్దామా అని కూడా ఆలోచిస్తున్నామని కంగన తెలిపింది. ప్రస్తుతం ‘మణికర్ణిక’ సీజీ వర్క్ నడుస్తున్నట్లు ఆమె వెల్లడించింది. ప్రస్తుతం తాను ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ‘మెంటల్ హై క్యా’ చిత్రంలో నటిస్తున్నట్లు కంగన తెలిపింది.

Comments

comments

Related Stories: