ఆఫీసు టెన్షన్‌ను అధిగమించండి

పొద్దున్న లేచిన మొదలు ఆఫీసు పనులతో పెద్దవాళ్లు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడి వల్ల వారు త్రీవ ఆనారోగ్యం బారిన పడ్డమే కాదు వారిలో రోగనిరోధక శక్తి కూడా తగ్గుతోంది. అందుకే ఆఫీసు పని ఒత్తిడి పడకుండా చేసుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. పనే సర్వస్వం కాదు. అది జీవితంలో ఒక భాగం మాత్రమే. కంపెనీ పని అంతా మీ భుజస్కంధాలపైనే లేదు. అందుకే ఈ కంపెనీ కాకపోతే మరొకటి అనే తత్వం అలవరుచుకోవాలి. ఒక్కమాటలో […]

పొద్దున్న లేచిన మొదలు ఆఫీసు పనులతో పెద్దవాళ్లు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడి వల్ల వారు త్రీవ ఆనారోగ్యం బారిన పడ్డమే కాదు వారిలో రోగనిరోధక శక్తి కూడా తగ్గుతోంది. అందుకే ఆఫీసు పని ఒత్తిడి పడకుండా చేసుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.

పనే సర్వస్వం కాదు. అది జీవితంలో ఒక భాగం మాత్రమే. కంపెనీ పని అంతా మీ భుజస్కంధాలపైనే లేదు. అందుకే ఈ కంపెనీ కాకపోతే మరొకటి అనే తత్వం అలవరుచుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంటి పని, ఆఫీసు పని రెండింటినీ సమతూకం చేసుకోగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. అలాగే ఆఫీసు సమస్యలను ఇంటికి తేకూడదు. ఇంటి సమస్యలు ఆఫీసులో ప్రతిఫలించకూడదు.

ఉద్యోగం చేసే చాలా మంది ఎక్కువగా తమకిష్టంలేని పనులే చేయాల్సి వస్తుంటుంది. అలాంటి సందర్భాలలో తమ విలువలు, ఆసక్తులు, నైపుణ్యాల విషయంలో సర్దుకుపోవాల్సివస్తుంటుంది. అందుకే మీకు నచ్చిన పని ఏమిటో తెలుసుకుని ఆ తరహా వృత్తిని ఎంచుకునే పయ్రత్నం చేయాలి.

వారంలో ఆరు రోజుల పాటు ఆఫీసు పనితోనే తలమునకలవుతుంటారు. దీని వల్ల బోర్ ఫీలవుతారు. ఒకలాంటి అసహనం పట్టిపీడిస్తుంటుంది. అందుకే అప్పుడప్పుడు రోజు వారీ ఆఫీసు పనుల నుంచి బ్రేక్ తీసుకుంటుండాలి. అలా బ్రేక్ తీసుకున్న సమయంలో మీకు నచ్చిన పనులను అంటే వ్యాయామాలు చేయడం, ప్రయాణాలు చేయడం, యోగ సాధన చేయడం వంటివి చేయొచ్చు. ప్రతి రోజూ కొంతసేపైనా సరే మీకు నచ్చిన పని మీద దృష్టి
సారించాలి.

కొంతమంది ఉద్యోగులు తమ విధులకు మించి ఎక్కువగా పనులను వీరావేశంతో చే స్తుంటారు. ఆఫీసులో ఉన్నత స్థానాలను అధిష్టించాలనే కోరికతో వాళ్లు అలా చేస్తుండవచ్చు. లేదా తమ ఉన్నతాధికారులకు ‘నో’ చెప్పే ధైర్యం లేక పోవడం వల్ల అలా చేస్తుండొచ్చు. ఇంకొందరు ఆఫీసర్ల మెప్పు పొందాలని అలా ప్రవర్తించవచ్చు. అలా కాకుండా ప్రొఫెషనల్‌గా ఉండడం అలవరుచుకోవాలి. మీకప్పగించిన మేర మీ పనిని నిర్వహించాలి. నిర్దిష్ట సమయం మాత్రమే ఆఫీసు పనికి కేటాయించగలనని కచ్చితంగా అధికారులకు చెప్పగలగాలి.

ఎప్పుడూ ఆశావాదిగా ఉండాలి. అప్పుడే జీవితం మీద ఒక హోప్ ఉంటుంది. పనివేళల్లో శరీర వ్యాయామాలకు కూడా కొంత సమయం కేటాయించాలి. లంచ్ బ్రేక్స్‌లో వాకింగ్, వార్మప్ వ్యాయామాలు చేయాలి. ఇవి మిమ్మల్ని ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా ఉంచుతాయి.

పనివేళల్లో రిలాక్సేషన్ ఇచ్చేవి శ్వాస వ్యాయామాలే. పనిచేసేటప్పుడు ప్రతి ఐదారు గంటలకొకసారి కళ్లు మూసుకుని రెండు నిమిషాల పాటు ముక్కు నుంచి శ్వాసను వదులుతూ, మళ్లీ లోపలికి పీలుస్తూ ఐదుసార్లు చేయాలి. ఇలా నిత్యం చేయడం వల్ల మీ ప్రవర్తనలో ఎంతో మార్పు వస్తుంది. తొందరగా కోపం రాదు. ఎంతో ప్రశాంత చిత్తంతో వ్యవహరిస్తారు.
కళ్లపై ఎక్కువ ఒత్తిడిపడకుండా వ్యాయామాలు చేయాలి. అలాగే నుదురుపై కూడా మసాజ్ చేసుకోవాలి. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల భుజాల దగ్గర ఉన్న కండరాలు బాగా అలసిపోతాయి. అందుకే ప్రతి రెండు మూడు గంటలకొకమారు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి.