ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

Online Cricket Betting Gang Arrested at Khammam

ఖమ్మం: ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. ఏడుగురు సభ్యులు గల ఈ ముఠా మూడు మాసాలుగా నగరంలోని రాపర్తి నగర్‌లోని ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విశాఖ పట్టణానికి చెందిన నలుగురు బుకీలతో కలిసి వీరు బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. అరెస్టు అయిన ముఠా సభ్యుల నుంచి రూ.55వేల నగదుతో పాటు ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Online Cricket Betting Gang  Arrested  at Khammam