ఆదుకున్న జడేజా..భారత్ 297 ఆలౌట్

Jadeja
అంటిగ్వా: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌటైంది. 203/6 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు బ్యాటింగ్ చేపట్టిన భారత్‌ను ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆదుకున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 24 పరుగులు చేసి కీమర్ రోచ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇషాంత్ శర్మ అండతో జడేజా పోరాటం కొనసాగించాడు. విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న వీరిద్దరూ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రవీంద్ర జడేజా అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియాకు అండగా నిలిచాడు. సమన్వయంతో ఆడిన ఇషాంత్ 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో జడేజాతో కలిసి 60 పరుగుల భాగస్వామ్యంలో పాలు పంచుకున్నాడు. తర్వాత వచ్చిన మహ్మద్ షమి (౦) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. అయితే చివరి బ్యాట్స్‌మన్ బుమ్రా (4) అండతో జడేజా విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన జడేజా 112 బంతుల్లో ఆరు బౌండరీలు, మరో సిక్సర్‌తో 58 పరుగులు చేసి చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ గౌరవప్రద స్కోరును అందుకుంది. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్ నాలుగు, గాబ్రియల్ మూడు, రోస్టన్ ఛేజ్ రెండు వికెట్లు పడగొట్టారు.

 Jadeja and Ishant lift India to 297 all out

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆదుకున్న జడేజా..భారత్ 297 ఆలౌట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.