ఆది, తాప్సీ జంటగా యాక్షన్ ఎంటర్‌టైనర్

కోన వెంకట్ సమర్పణలో ఎంవివి సినిమా, కోన ఫిలిమ్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా ఒక విభిన్నమైన కథతో నిర్మిస్తున్న నూతన చిత్రం ఈనెల 21న ప్రారంభంకానుంది. సరైనోడు, నిన్ను కోరి చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు చేసి ఇప్పుడు రంగస్థలం, అజ్ఞాతవాసి చిత్రాల్లో మంచి పాత్రలు పోషిస్తున్న ఆది పినిశెట్టి కథానాయకుడిగా తెరకెక్కనున్న  ఈ చిత్రంలో తాప్సీ కథానాయికగా నటిస్తోంది. ఇందులో ఓ ప్రముఖ కథానాయిక కూడా నటించనుంది. ఆది, తాప్సీ వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ […]

కోన వెంకట్ సమర్పణలో ఎంవివి సినిమా, కోన ఫిలిమ్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా ఒక విభిన్నమైన కథతో నిర్మిస్తున్న నూతన చిత్రం ఈనెల 21న ప్రారంభంకానుంది. సరైనోడు, నిన్ను కోరి చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు చేసి ఇప్పుడు రంగస్థలం, అజ్ఞాతవాసి చిత్రాల్లో మంచి పాత్రలు పోషిస్తున్న ఆది పినిశెట్టి కథానాయకుడిగా తెరకెక్కనున్న  ఈ చిత్రంలో తాప్సీ కథానాయికగా నటిస్తోంది. ఇందులో ఓ ప్రముఖ కథానాయిక కూడా నటించనుంది. ఆది, తాప్సీ వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల నేపథ్యంలో రూపొందనుంది. వెన్నెల కిషోర్, శివాజీ రాజా, తులసి, సాయిచంద్‌లు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ‘లవర్స్’ ఫేమ్ హరి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి కెమెరాః తోట రాజు, సంగీతం గోపీసుందర్, కూర్పుః ప్రవీణ్ పూడి, స్క్రీన్‌ప్లేః కోన వెంకట్.

Comments

comments

Related Stories: