ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే సిఎం కెసిఆర్ లక్ష్యం

మనతెలంగాణ/శామీర్‌పేట రూరల్ : దత్తత గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ కంకణ బద్దుడయ్యాడని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మూడుచింతల పల్లి గ్రామంలో 2.20 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి దత్త గ్రామాలలో ప్రజలంతా కలిసి కట్టుగా శ్రమించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుదామన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులతో చేపడుతున్న పనులు పురోగతిలో ఉన్నాయని, సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. ప్రజా సంక్షేమం […]

మనతెలంగాణ/శామీర్‌పేట రూరల్ : దత్తత గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ కంకణ బద్దుడయ్యాడని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మూడుచింతల పల్లి గ్రామంలో 2.20 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి దత్త గ్రామాలలో ప్రజలంతా కలిసి కట్టుగా శ్రమించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుదామన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులతో చేపడుతున్న పనులు పురోగతిలో ఉన్నాయని, సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం విజయవంతంగా పూర్తిచేయడానికి అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను పరిరక్షించడానికి అందరు నడుంభిగించాలని తెలిపారు. గ్రమాల వారిగా ప్రభుత్వ స్థలాలు, వ్యవసాయ పొలాలు, విద్యా, వాణిజ్యసంస్థల్లో, రోడ్లకు ఇరువైపుల విరివిగా మొక్కలు నాటి వాటిని కాపాడే బాధ్యత చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చంద్రశేఖర్‌యాదవ్, టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, డీఈపిఆర్ శ్రీనివాస్‌రెడ్డి, మండల కోఅప్షన్ సభ్యుడు చాంద్‌పాషా, జడ్పిఏఈ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ పద్మాలకా్ష్మరెడ్డి, ఉప సర్పంచ్ మురళిగౌడ్, ఎంపిటిసి సక్రి, మేడ్చల్ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ నాగరాజు, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు విష్ణుగౌడ్, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి,  నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఆంజనేయులు, రాములునాయక్, నర్సింహ్మరెడ్డి, గోపాల్‌రెడ్డి, సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: