ఆదర్శనగర్‌లో బోనాల సందడి

కరీంనగర్ : నగరంలోని ఆదర్శనగర్‌లో ఆదివారం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వరంలో మైసమ్మ బోనాల వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. కాలనీవాసులు అమ్మకు బోనం సమర్పిస్తూ సల్లంగా చూడమ్మ అంటూ మొక్కులు తీర్చుకుంటూ వేడుకున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య శివసత్తుల పూనకాలతో మహిళలు బోనాలను తలపై పెట్టుకుని సామూహికంగా ర్యాలీగా బయలుదేరి అమ్మకు బోనం సమర్పించారు. దీంతో ఆదర్శనగర్ కాలనీ అంతా పండుగ వాతావరణం కనిపించింది. కాలనీవాసులు బోనాల ఉత్సవాలను వైభవోపేతంగా జరుపుకున్నారు. కార్పొరేటర్ వైద్యుల […]


కరీంనగర్ : నగరంలోని ఆదర్శనగర్‌లో ఆదివారం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వరంలో మైసమ్మ బోనాల వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. కాలనీవాసులు అమ్మకు బోనం సమర్పిస్తూ సల్లంగా చూడమ్మ అంటూ మొక్కులు తీర్చుకుంటూ వేడుకున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య శివసత్తుల పూనకాలతో మహిళలు బోనాలను తలపై పెట్టుకుని సామూహికంగా ర్యాలీగా బయలుదేరి అమ్మకు బోనం సమర్పించారు. దీంతో ఆదర్శనగర్ కాలనీ అంతా పండుగ వాతావరణం కనిపించింది. కాలనీవాసులు బోనాల ఉత్సవాలను వైభవోపేతంగా జరుపుకున్నారు. కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవి అంజన్‌కుమార్, చిగిరి వెంకటమ్మ, రవి, అలయ కమిటీ అధ్యక్షుడు మెతుకు కనుకయ్య, ఉపాధ్యక్షుడు ఉస్కమల్లయ్య, గంధం లక్ష్మినారాయణ, ప్రధాన కార్యదర్శి భూంరెడ్డి, కార్యదర్శులు దామరపల్లి జగ్గారెడ్డి, సంయుక్త కార్యదర్శి బల్ల సత్తయ్య, కందుకూరి రామబ్రహ్మం, కోశాధికారి దామరపల్లి సత్యలక్ష్మి, మెతుకు జయలక్ష్మి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నంది దేవేందర్, తోట మల్లయ్య సభ్యులు దేవసాని కొమురయ్య, దామరపల్లి విఠల్‌రెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: