ఆడపిల్లకు జన్మనిచ్చిందని ‘త్రిపుల్ తలాఖ్’

లక్నో: భార్య ఆడపిల్లకు జన్మనిచ్చిందనే కారణంతో అదనపు కట్నం డిమాండ్ చేస్తూ భర్త ‘త్రిపుల్ తలాఖ్’ ఇచ్చిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఓ వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన యువతితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వారం రోజుల క్రితం ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆడపిల్ల పుట్టిందనే కోపంతో అదనపు కట్నంగా రూ.50వేల నగదుతో పాటు ద్విచక్రవాహనం తీసుకురావాలని భార్యను పుట్టింటికి పంపించేశాడో ప్రబుద్ధుడు. కాగా, భార్య అదనపు కట్నం తీసుకురాకపోవడంతో పాటు ఆడపిల్లకు […]

లక్నో: భార్య ఆడపిల్లకు జన్మనిచ్చిందనే కారణంతో అదనపు కట్నం డిమాండ్ చేస్తూ భర్త ‘త్రిపుల్ తలాఖ్’ ఇచ్చిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఓ వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన యువతితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వారం రోజుల క్రితం ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆడపిల్ల పుట్టిందనే కోపంతో అదనపు కట్నంగా రూ.50వేల నగదుతో పాటు ద్విచక్రవాహనం తీసుకురావాలని భార్యను పుట్టింటికి పంపించేశాడో ప్రబుద్ధుడు. కాగా, భార్య అదనపు కట్నం తీసుకురాకపోవడంతో పాటు ఆడపిల్లకు జన్మనిచ్చిందని భార్యకు త్రిపుల్ తలాఖ్ ఇచ్చాడు. దీంతో వారం రోజుల పసిబిడ్డతో మహిళ రోడ్డున పడింది. చేసేదేమిలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Stories: