ఆట మీద దృష్టిపెట్టాలని పాండ్యాకు అభిమానుల చీవాట్లు!

భారత్ ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం అందరికి తెలిసిందే… ఇప్పటికే రెండు మ్యాచుల్లో భారత క్రికెట్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. భారత ఆటగాళ్లు సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు ఈ మధ్యకాలంలో అభిమానులు వారిపై దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు మండిపడ్డారు. భారత జట్టు ఇంగ్లండ్ తో మూడో టెస్ట్ ఆడేందుకు నాటింగ్ హమ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌కు చేరుకుంది. అక్కడికి షికారుకెళ్లిన హార్దిక్ ఆ ఫొటోలను […]

భారత్ ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం అందరికి తెలిసిందే… ఇప్పటికే రెండు మ్యాచుల్లో భారత క్రికెట్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. భారత ఆటగాళ్లు సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు ఈ మధ్యకాలంలో అభిమానులు వారిపై దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు మండిపడ్డారు. భారత జట్టు ఇంగ్లండ్ తో మూడో టెస్ట్ ఆడేందుకు నాటింగ్ హమ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌కు చేరుకుంది. అక్కడికి షికారుకెళ్లిన హార్దిక్ ఆ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

ఈ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్నా అని ట్యాగ్ కూడా తగిలించాడు. దీంతో అభిమానులకు కోపం వచ్చింది. అసలే రెండు టెస్టుల్లో చెత్త ప్రదర్శన చేసిన హార్దిక్ పై ఫైర్ అయ్యారు. క్రికెట్ ప్రాక్టీస్ చేయకుండా వీధుల్లో ఈ తిరుగుడు ఏంటని చీవాట్లు పెట్టారు. ‘బీసీసీఐ డబ్బుతో నీ జీవితంలో మొదటి, చివరి యూకే టూర్‌ను బాగా ఎంజాయ్ చెయ్’ అని ఓ నెటిజన్ విమర్శించగా, సోకులపై కాదు ఆటపై దృష్టి పెట్టాలని మరొకరు సూచించారు. మరికొందరైతే.. అక్కడ క్రికెట్ ఆడటానికి వెళ్లావా? లేక ఎంజాయ్ చేయడానికి వెళ్లావా? అని హార్దిక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Stories: