ఆటో ఢీకొని బాలుడి మృతి..!

Boy Died in Auto Accident at Ramanthapur

హైదరాబాద్: రామంతాపూర్ పరిధిలోని శారదనగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ ఆటో ఐదేళ్ల బాలుడిని చిదిమేసింది.  స్థానికంగా నివాసముంటున్న ఉమేశ్‌ అనే వ్యక్తి తన కుంటుంబంతో కలిసి సరుకులు తీసుకోడానికి కిరాణ దుకాణానికి వచ్చాడు. సరుకులు తీసుకుని దుకాణం నుంచి బయటకు వస్తున్న సమయంలో వేగంగా వచ్చిన ఆటో వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి మహిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హూటాహూటిన మహిత్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆటో అతివేగమే బాలుడి ప్రాణాలు తీశాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments